Hardik Pandya: నాకొద్దీ కెప్టెన్సీ.. చేతిలేత్తేసిన హర్ధిక్ పాండ్యా
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అయోమయానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు మ్యాచ్ మధ్యలోనే తన కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు.

Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతులెత్తేసాడు. కెప్టెన్సీ చేయలేక తన బాధ్యతలను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తడబడ్డాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అయోమయానికి గురయ్యాడు.
SRH VS MI: ఉప్పల్‌లో రికార్డుల సునామీ.. ఒక్క మ్యాచులో ఎన్ని రికార్డులో..
సన్‌రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు మ్యాచ్ మధ్యలోనే తన కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు. దాంతో రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాను బౌండరీ లైన్ వద్దకు పరుగెత్తించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. గత మ్యాచ్‌లో రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు పరుగెత్తించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వదిలేసి రోహిత్ శర్మకు అప్పజెప్పడం ఉత్తమమని సూచిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్‌పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.