Rohit Sharma: ముంబై కాకుంటే నేను ఆడే జట్టు ఇదే.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టేసిన ముంబై నిర్ణయంపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2023 | 04:20 PMLast Updated on: Dec 25, 2023 | 4:20 PM

Rohit Sharma Wants To Play For Kkr Insteda Of Mumbai Indians

Rohit Sharma: ఐపీఎల్ మినీ వేలానికి ముందు చర్చనీయాంశంగా మారిన డీల్ ఏదైనా ఉందంటే అది గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాదే. ట్రేడింగ్‌లో గుజరాత్‌కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి హార్ధిక్‌ను ముంబై ఇండియన్స్ టీమ్‌లోకి తీసుకుంది. వెంటనే కెప్టెన్‌గానూ ప్రకటించేసింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టేసిన ముంబై నిర్ణయంపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు.

MS DHONI: ధోనీకి ఇదే చివరి సీజనా.. మహి ఏమన్నాడంటే ?

సోషల్ మీడియాలో భారీగా అన్ ఫాలో కూడా అయ్యారు. ఈ పరిణామాలపై రోహిత్ ఇప్పటి వరకూ స్పందించలేదు. హిట్ మ్యాన్ కోసం మిగిలిన జట్లు ట్రై చేస్తున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో రోహిత్ పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఒకవేళ ముంబై కాకుండా మరోజట్టుకు ఆడాల్సి వస్తే ఏది ఎంచుకుంటారన్న ప్రశ్న రోహిత్‌కు ఎదురైంది. ఈ ప్రశ్నకు హిట్ మ్యాన్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ముంబై కాకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఈడెన్ గార్డెన్స్ తన ఫేవరేట్ గ్రౌండ్ కావడంతోనే ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఉందన్నాడు.

హిట్ మ్యాన్‌కు ఈడెన్‌లో అద్భుతమైన రికార్డుంది. వన్డేల్లో అతను ఇదే గ్రౌండ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. అయితే ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత ఈ వీడియో వైరల్‌గా మారడం చర్చనీయాంశమైంది. వచ్చే సీజన్ తర్వాత ముంబై జట్టులో మళ్లీ రోహిత్‌ను చూడకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో అతను తర్వాత ఏ జట్టుకు ఆడతాడనేది వేచిచూడాలి.