ROHIT SHARMA: వరల్డ్ కప్‌లో జట్టును నడిపించేది అతనే.. కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన జైషా
గతేడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌లు టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. వన్డే ఫార్మాట్‌పై పూర్తి ఫోకస్ పెట్టగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టు టీ20 సిరీస్‌లు ఆడింది.
ROHIT SHARMA: జూన్‌లో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత జట్టును ఎవరు నడిపిస్తారనే దానిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా స్పష్టం చేశాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌లు టీ20 మ్యాచ్‌లు ఆడలేదు.
CAG Report: కాళేశ్వరంలో దోపిడీ నిజమే.. బీఆర్ఎస్ సర్కార్‌ని ఉతికారేసిన కాగ్
వన్డే ఫార్మాట్‌పై పూర్తి ఫోకస్ పెట్టగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో కుర్రాళ్లతో కూడిన జట్టు టీ20 సిరీస్‌లు ఆడింది. టీ20 ప్రపంచకప్ 2024 కోసమే హార్దిక్ సారథ్యంలో జట్టును తయారు చేస్తున్నామని కూడా అప్పట్లో బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. అయితే, వాటిలో నిజం లేదని జైషా స్టేట్‌మెంట్‌తో తేలిపోయింది. రోహిత్ సారథిగా, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రకటించారు. ఇటీవల ఐపీఎల్‌లో గుజరాత్ నుంచి ట్రేడింగ్‌లో పాండ్యాను తెచ్చుకున్న ముంబై.. వెంటనే రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా ప్రకటించింది. దీనిపై రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో టీమిండియా టీ ట్వంటీ సారథిగా కూడా అతన్ని తప్పిస్తారని వార్తలు వచ్చినా.. జైషా వ్యాఖ్యలతో అది నిజం కాదని తేలిపోయింది.
ఇక కోహ్లీ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడతాడా లేదా అన్నది మాత్రం జైషా క్లారిటీ ఇవ్వలేదు. టీ20 ప్రపంచకప్ అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.