సిడ్నీ టెస్ట్ నుంచి ఔట్, రోహిత్ శర్మ చెత్త రికార్డ్
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. రిటైర్మెంట్ వార్తలు వినిపిస్తున్న వేళ సిడ్నీ టెస్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. రిటైర్మెంట్ వార్తలు వినిపిస్తున్న వేళ సిడ్నీ టెస్ట్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్ మధ్యలో తుది జట్టు నుంచి తొలగించబడిన తొలి టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఏ సిరీస్ మధ్యలో భారత కెప్టెన్‌ను పక్కన పెట్టిన దాఖలాలు లేవు. అయితే, ఓవరాల్‌గా ఇలాంటి సీన్ నాలుగుసార్లు జరిగింది. రోహిత్ కంటే ముందుగా పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్, శ్రీలంక మాజీ కెప్టెన్ దినేష్ చండిమాల్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ డెనెస్‌లను ప్లేయింగ్-11 నుంచి తొలగించారు. టెస్టు సిరీస్‌లో కెప్టెన్ తప్పుకోవడం 51 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.