Rohit Sharma : నువ్వు మెడిసిన్ లాంటోడివి రోహిత్..

ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15 న ముంబై ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకోవడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఫామ్ లో ఉన్న రోహిత్ ను కావాలనే పక్కన పెట్టారని సోషల్ మీడియా వేదికగా నిప్పులు కురిపించారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. ఈ విషయం చాలా మందికి షాకింగ్ గా అనిపించినా.. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యకు మద్దతుగా నిలిచాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 03:11 PMLast Updated on: Dec 18, 2023 | 3:11 PM

Rohit You Are Taking Medicine

ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15 న ముంబై ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకోవడంతో రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఫామ్ లో ఉన్న రోహిత్ ను కావాలనే పక్కన పెట్టారని సోషల్ మీడియా వేదికగా నిప్పులు కురిపించారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. ఈ విషయం చాలా మందికి షాకింగ్ గా అనిపించినా.. భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ హార్దిక్ పాండ్యకు మద్దతుగా నిలిచాడు. గవాస్కర్ మాట్లాడుతూ.. కొన్ని సార్లు ఫ్రాంచైజీలకు కొత్త ఆలోచనలు అవసరం. హార్దిక్ కెప్టెన్ నిర్ణయం ముంబైకి ప్రయోజనకరంగా ఉంటుంది. గత రెండేళ్లలో రోహిత్ ఐపీఎల్ లో అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. భారీ స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడు. గత ఏడాది ప్లేయ ఆఫ్ కు చేరినా 2022 లో చివరి స్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా రోహిత్ జోరు కన్పించడం లేదు. నిరంతరం క్రికెట్ ఆడటం వలన అలసిపోయి ఉంటాడు”. అని ఈ లెజండరీ బ్యాటర్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ గుజరాత్ జట్టును 2022 లో ఛాంపియన్ గా నిలిపాడని.. ఇక ఈ ఏడాది ఫైనల్ కు చేర్చాడని గవాస్కర్ గుర్తు చేసాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే హార్దిక్ ముంబై కి మంచి ఫలితాలను అందిస్తాడు గవాస్కర్ తెలియజేశాడు. పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ కూడా మద్దతు తెలిపాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతుంటే.. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో గాయపడిన పాండ్య కోలుకుంటున్నాడు.