ఇది కదా కిక్కిచ్చే న్యూస్ సన్ రైజర్స్ లోకి రోహిత్ ?
ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. వేరే జట్లలోని స్టార్ ప్లేయర్స్ ను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతీ టీమ్ లో నలుగురు తప్పిస్తే మిగిలిన ప్లేయర్స్ అందరూ వేలంలోకి రావాల్సిందే.
ఐపీఎల్ మెగా వేలం ముంగిట ఫ్రాంచైజీలు తమ తమ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. వేరే జట్లలోని స్టార్ ప్లేయర్స్ ను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతీ టీమ్ లో నలుగురు తప్పిస్తే మిగిలిన ప్లేయర్స్ అందరూ వేలంలోకి రావాల్సిందే. దీంతో వచ్చే వేలం తర్వాత ప్రతీ టీమ్ కాంబినేషన్ పూర్తిగా మారిపోనుంది. ఇదిలా ఉంటే పలువురు స్టార్ ప్లేయర్స్ సైతం వేర్వేరు కారణాలతో తమ పాత జట్లకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత ఫ్రాంచైజీ తీరుపై అసంతృప్తిగా ఉన్న హిట్ మ్యాన్ వచ్చే సీజన్ లో కొత్త జట్టుకు ఆడతాడని వార్తలు వినిపిస్తున్నాయి.
రోహిత్ వేలంలోకి వస్తే తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు పోటీ పడతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ రేసులో ముందున్నట్టు సమాచారం. సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ రోహిత్ కు భారీ డీల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై హిట్ మ్యాన్ ఇంకా స్పందించలేదని వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ జట్టులోకి వస్తే కెప్టెన్సీ ఇవ్వడం లాంఛనమే. ఎందుకంటే ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ముంబైకి ఐదు టైటిళ్ళు గెలిపించిన రోహిత్ కు తిరుగులేని ట్రాక్ రికార్డుంది. రోహిత్ గతంలో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడి తర్వాత ముంబై జట్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు హిట్ మ్యాన్ రీఎంట్రీ ఇస్తే హైదరాబాద్ ను ఛాంపియన్ గా నిలపడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత సీజన్ లో సన్ రైజర్స్ రన్నరప్ గా నిలిచింది.