ROHIT SHARMA: మా ప్లాన్ మాకుంది.. ఇంగ్లాండ్‌కు రోహిత్ వార్నింగ్
సొంతగడ్డపై టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. బజ్ బాల్ క్రికెట్‌తో అదరగొడుతున్న ఇంగ్లీష్ టీమ్‌ను తేలిగ్గా తీసుకోలేం. ఫలితంగా ఈ రెండు జట్ల రెడ్ బాల్ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ROHIT SHARMA: వరల్డ్ క్రికెట్‌లో రసవత్తర టెస్ట్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అత్యుత్తమ జట్లు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ గురువారం నుంచే మొదలుకాబోతోంది. సొంతగడ్డపై టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నా.. బజ్ బాల్ క్రికెట్‌తో అదరగొడుతున్న ఇంగ్లీష్ టీమ్‌ను తేలిగ్గా తీసుకోలేం. ఫలితంగా ఈ రెండు జట్ల రెడ్ బాల్ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
India vs England: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బజ్ బాల్ కాన్సెప్ట్ గురించి ఆలోచించడం లేదని చెప్పాడు. ఇంగ్లాండ్‌పై తమ వ్యూహాలు తమకున్నాయని హిట్ మ్యాన్ కాన్ఫిడెంట్‌గా వ్యాఖ్యానించాడు. టెస్టు ఫార్మాట్ ఎంతో గొప్పదని, ఆటగాళ్లుగా అసలైన సవాళ్లను టెస్టుల్లోనే ఎదుర్కొంటామన్నాడు. తర్వాతి తరాలకు టెస్టు ఫార్మాట్ ప్రాముఖ్యత తెలియజేయడం మన బాధ్యతగా చెప్పుకొచ్చాడు. ఇక ఇంగ్లాండ్ జట్టును తక్కువగా అంచనా వేయడం లేదన్నాడు.
ఆ జట్టులో అద్భుతమైన ఆటగాళ్ళున్నారని, వారిని ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసన్నాడు. పక్కా వ్యూహంతో తొలి టెస్టుకు సిద్ధమయ్యామని చెప్పిన రోహిత్.. తుది జట్టు కూర్పు ఎప్పుడూ కష్టమేనన్నాడు. విరాట్ దూరమవడం జట్టుకు లోటేనని, ఆ స్థానంలో యువ ఆటగాళ్లను ఆడిస్తున్నామని చెప్పాడు. అదే సమయంలో సీనియర్లకు అవకాశాలు మూసుకుపోలేదంటూ రోహిత్ హింట్ ఇచ్చాడు.