Hardik, Rohit : హార్ధిక్‌కు రోహిత్‌ ముద్దు.. ఫైనల్‌కు ఇదే హైలైట్‌.. వాట్ ఏ సీన్‌…

టీ20 వాల్డ్‌కప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 30, 2024 | 01:03 PMLast Updated on: Jun 30, 2024 | 1:03 PM

Rohits Kiss To Hardik This Is The Highlight Of The Final What A Scene

టీ20 వాల్డ్‌కప్‌ విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు అందుకున్న రెండో జట్టు ఇదే. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే. ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత.. గ్రౌండ్‌లో చాలా ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయ్. రోహిత్, హార్ధిక్, కోహ్లీ.. చిన్న పిల్లోడిలా ఏడ్చేశారు. ఆ ప్రీసియస్‌ మూమెంట్‌ను ఫ్యామిలీతో షేర్‌ చేసుకున్నారు.

రోహిత్ వాల్డ్ కప్ అందుకున్న క్షణం.. అఖండ భారతావని గుండె ఉప్పొంగింది. మ్యాచ్‌ తర్వాత.. హార్ధిక్‌కు రోహిత్‌ ముద్దు పెట్టిన సీన్.. ఇప్పుడు వైరల్ అవుతోంది. రోహిత్‌, హార్ధిక్‌ మధ్య వివాదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో డిస్కషన్ నడుస్తుండగా.. ఒక్క ముద్దు అన్నింటిని చెరిపేసినట్లు అయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని త‌ప్పించి హార్ధిక్ పాండ్యాని కెప్టెన్ చేయ‌డంతో హిట్ మ్యాన్ అభిమానులు మాములు రచ్చ చేయలేదు. రోహిత్ నుంచి ఎలాంటి ఇన్‌పుట్ తీసుకోకుండా హార్దిక్‌ని కెప్టెన్ చేయ‌డం ఏంట‌ని చాలామంది ఫైర్ అయ్యారు.

ఇక ఫీల్డ్‌లో రోహిత్‌ని బౌండరీ లైన్‌లోకి పంపించి ఫీల్డింగ్ చేయించ‌డం.. ఎక్కడ కూడా రోహిత్ ప్రస్తావ‌న తీసుకురాక‌పోవ‌డంతో మరింత ఆగ్రహం వ్యక్తం అయింది. కట్‌ చేస్తే.. టీమిండియా టీ20 ప్రపంచ క‌ప్ ఛాంపియ‌న్‌గా అవతరించింది. భారత్‌ గెలిచిన తర్వాత.. రోహిత్‌, హార్దిక్ మధ్య కొన్ని ఎమోష‌న‌ల్ మూమెంట్స్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయ్. హార్ధిక్ ద‌గ్గర‌కు వ‌చ్చిన రోహిత్… అత‌ని చెంప‌పై ముద్దు పెట్టి హ‌గ్ చేసుకొని అభినందించాడు. ఇది చూశాక ఇద్దరి మ‌ధ్య విభేదాలు తొల‌గిపోయాయని… టీమిండియాలో మంచి వాతావ‌ర‌ణం ఉంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.