England : ఇంగ్లాండ్‌ను ఆదుకున్న రూట్
రాంఛీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ (India-England) నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. భారత బౌలర్ల దెబ్బకు ఆరంభంలోనే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ (England) అనూహ్యంగా బజ్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ సిరీస్‌లో తొలిసారి టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టే ఆడి నిలదొక్కుకుంది. ఫలితంగా తొలిరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి.
రాంఛీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ (India-England) నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది. భారత బౌలర్ల దెబ్బకు ఆరంభంలోనే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ (England) అనూహ్యంగా బజ్‌బాల్ ఆటకు గుడ్‌బై చెప్పింది. ఈ సిరీస్‌లో తొలిసారి టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టే ఆడి నిలదొక్కుకుంది. ఫలితంగా తొలిరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి. రాంచీ పిచ్‌ను చూసి ఇదేదో తేడాగా ఉంది అని ముందే అనుకున్న ఇంగ్లీష్ టీమ్.. తొలి రోజు ఫస్ట్ సెషన్‌లో వెంటవెంటనే ఐదు వికెట్లు కోల్పోవడంతో బజ్‌బాల్‌కు స్వస్తి పలికి అసలైన టెస్టు ఆడేందుకు యత్నించింది. ఓవర్‌కు 4 లేదా 5 పరుగుల రన్‌రేట్ కూడా దాటి ఆడే ఇంగ్లండ్.. రాంచీలో తొలిరోజు రన్‌రేట్ 3.4 దాటలేదు. ఆరంభంలోనే అరంగేట్రం బౌలర్ ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.
ఈ పరిస్థితుల్లో జో రూట్ ఇంగ్లీష్ టీమ్‌ను ఆదుకున్నాజు. ఈ సిరీస్‌లో తొలి మూడు టెస్టులలో అట్టర్ ప్లాఫ్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రూట్.. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్ కీపర్ బెన్‌ఫోక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు 113 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. దీంతో తొలిరోజు ఆటలో రూట్ సెంచరీ హైలెట్‌గా నిలిచింది. బెన్ ఫోక్స్ 47, జాక్ క్రాలే 42 పరుగులతో రాణించగా.. చివర్లో రాబిన్సన్ ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ తడబడి నిలబడింది. మొదటిరోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లకు 302 పరుగులు చేసింది. రూట్ 106 , రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అరంగేట్రంలోనే ఆకట్టుకున్న ఆకాశ్ దీప్ (Akash Deep) 3 వికెట్లు పడగొట్టగా…సిరాజ్ 2 (Siraj 2), జడేజా (Jadeja), అశ్విన్ (Ashwin) ఒక్కో వికెట్ పడగొట్టారు. రెండోరోజు తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేస్తే భారత్ పట్టుబిగించే అవకాశముంటుంది.