RCB, Virat Kohli : కింగ్ కోహ్లీ మరో రికార్డు…

ఐపీఎల్‌ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) స్టార్‌ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి మరోసారి అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 10, 2024 | 05:02 PMLast Updated on: May 10, 2024 | 5:02 PM

Royal Challengers Bangalore Star Opener Virat Kohli In Ipl Season 17

ఐపీఎల్‌ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) స్టార్‌ ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి మరోసారి అదిరిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) తో మ్యాచ్‌లో కోహ్లి బౌలర్లను ఊచకోత కోశాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినా.. 47 బంతులలోనే 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ (IPL) లో పంజాబ్‌ కింగ్స్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో కోహ్లి పంజాబ్‌ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), చెన్నై సూపర్ కింగ్స్‌పై ఈ ఘనత సాధించాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600 పరుగులు మార్క్‌ను అందుకున్న కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) రికార్డును కోహ్లి సమం చేశాడు. కోహ్లి 4 సీజన్‌లలో 600 ప్లస్‌ పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో కోహ్లి 12 మ్యాచ్‌లు ఆడి 634 పరుగులు చేశాడు.