Rajat Patidar : రజత్ పాటిదార్ బాదుడే బాదుడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఐపీఎల్ (IPL) సెకండాఫ్ లో చెలరేగిపోతున్నాడు. వరుసగా ఫిఫ్టీలు బాదుతూ.. సత్తాచాటుతున్నాడు.

Royal Challengers Bangalore star player Rajat Patidar is on fire in the second half of the IPL.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఐపీఎల్ (IPL) సెకండాఫ్ లో చెలరేగిపోతున్నాడు. వరుసగా ఫిఫ్టీలు బాదుతూ.. సత్తాచాటుతున్నాడు. తాజాగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్ లో 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. తనకు లభించిన లైఫ్ తో రజత్ పాటిదార్ సిక్సర్ల వర్షం కురిపించాడు.
మరీ ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ (Rahul Chahar) ను టార్గెట్ చేసుకుని అతడి ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. ఈ యంగ్ ప్లేయర్ లెగ్ స్పిన్నర్ల బౌలింగ్ లో రెచ్చిపోయి దంచికొడుతుంటాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు లెగ్ స్పిన్ లో 48 బంతులు ఎదుర్కొని 127 పరుగులు చేశాడు. అందులో 15 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. కాగా ఈ సీజన్ లో రజత్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 213 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి.