Royal Challengers Bangalore: ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పేరు మార్చుకోనున్న ఆర్‌సీబీ
పేరులో స్వల్ప మార్పు చేయాలని ఆర్‌సీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇంగ్లీష్ స్పెల్లింగ్‌ను మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుగా పలుకుతున్నారు. అయితే రానున్న సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మార్చనున్నట్లు తెలుస్తోంది.

Royal Challengers Bangalore: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్‌సీబీ తమ పేరును మార్చుకోవాలని భావిస్తోందట. గత 16 ఏళ్లుగా ఆ జట్టు టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఇప్పటికే టీమ్ లోగోతో పాటు కోచ్‌లను ఆటగాళ్లను మార్చినా..ఫలితం మాత్రం దక్కలేదు. ఈ క్రమంలోనే తమ పేరులో స్వల్ప మార్పు చేయాలని ఆర్‌సీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
DELHI CAPITALS: ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్‌షాక్.. సీజన్ నుంచి 4 కోట్ల ప్లేయర్ ఔట్
అది కూడా ఇంగ్లీష్ స్పెల్లింగ్‌ను మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుగా పలుకుతున్నారు. అయితే రానున్న సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మార్చనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆర్‌సీబీ షేర్ చేసిన ఓ వీడియోలో ఈ విషయం స్పష్టమైంది. ఈ వీడియోలో శాండల్ వుడ్ స్టార్ యాక్టర్ రిషభ్ శెట్టి.. రాయల్, ఛాలెంజర్స్, బెంగళూరు అని వేర్వేరుగా రాసిన మూడు దున్నల్లో ఒక దున్నను టచ్ చేస్తాడు.. ఆ దున్నపై బెంగుళూరు అని రాసి ఉంది. ఆ వెంటనే అర్ధమైందా అని కన్నడలో ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బెంగళూరు నగరానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటేతర ఫ్రాంచైజీలు కూడా తమ పేరులో బెంగుళూరుకు బదులు బెంగళూరు అని రాస్తున్నాయి.
మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఈ పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.