Royal Challengers Bengaluru: పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్.. బెంగళూరుకు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై -1.124 రన్‌రేటుతో పదో స్థానంలో నిలిచింది. దీంతో ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయా లేదా అనే చర్చ మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2024 | 06:57 PMLast Updated on: Apr 13, 2024 | 6:57 PM

Royal Challengers Bengaluru Will Reach Play Off In Ipl 2024 Is There Any Chances

Royal Challengers Bengaluru: ఐపీఎల్ 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. లక్నోపై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానానికి చేరింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చివరి ప్లేస్‌కు పడిపోయింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై -1.124 రన్‌రేటుతో పదో స్థానంలో నిలిచింది.

BANDI SANJAY: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం: బండి సంజయ్

దీంతో ఆర్సీబీకి ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయా లేదా అనే చర్చ మొదలైంది. అయితే 2009, 2011 సీజన్‌లోనూ ఆర్సీబీది దాదాపు ఇదే పరిస్థితి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది. కానీ ఆ తర్వాత గొప్పగా పుంజుకుని ఫైనల్స్‌కు కూడా చేరింది. ఈ సీజన్‌లోనూ బెంగళూరు అదే తరహాలో కొనసాగితే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉంటాయి. అయితే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించాలి. దీంతో పాటు ఇతర జట్ల ఫలితంపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్‌లతో రెండు మ్యాచ్‌లు, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలో మ్యాచ్ ఆర్సీబీ ఆడనుంది.

ఫామ్‌లో ఉన్న ప్రత్యర్థి బ్యాటర్లను బెంగళూరు బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేదే అసలు ప్రశ్న. బౌలర్లు చెలరేగితేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరగలదు. గత మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా పస లేని బౌలింగ్‌తో ఓడిపోయింది. కాగా, సొంతమైదానంలో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది.