అరేయ్ మీకో దండం నేను రిటైరవ్వట్లే
ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన టీమిండియా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ను సంబరాల్లో ముంచెత్తింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి మూడోసారి మెగాటోర్నీ విజేతగా నిలిచింది.

ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన టీమిండియా కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ను సంబరాల్లో ముంచెత్తింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలిచి మూడోసారి మెగాటోర్నీ విజేతగా నిలిచింది. అన్ని విభాగాల్లో టోర్నీ ఆరంభం నుంచీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ దుమ్మురేపిన రోహిత్ సేన అంచనాలకు తగ్గట్టే టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వారి ఆనందాన్ని డబుల్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. వన్డేల నుంచి తాను రిటైర్ కావడం లేదని ప్రకటించాడు. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయొద్దని, ఇంకా కొన్నేళ్ళ పాటు క్రికెట్ ఆడతానంటూ స్పష్టం చేశాడు.
భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు కూడా రోహిత్ సమాధానమిచ్చాడు. భవిష్యత్తు గురించి తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని పేర్కొన్నాడు. జరగాల్సింది అదే జరుగుతుందనీ, తానైతే ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించట్లేదని చెప్పాడు. తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని కోరాడు.
ఇప్పుడు తాను ఇచ్చిన క్లారిటీ ఈ రిటైర్మెంట్ రూమర్లు ఆగిపోతాయని భావిస్తున్నట్టు రోహిత్ వ్యాఖ్యానించాడు. వన్డే క్రికెట్‍ను ఇప్పట్లో వీడేది లేదన్నాడు. ప్రస్తుతం రోహిత్ , కోహ్లీ, జడేజాలానే టెస్ట్, వన్డే ఫార్మాట్ లలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై భారత సారథి ప్రశంసలు కురిపించాడు. సైలెంట్ సూపర్ హీరో అంటూ పొగిడాడు. ఈ టోర్నీలో శ్రేయస్ 243 రన్స్ చేశాడు. నాలుగో స్థానంలో వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తరఫున ఈ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని రోహిత్ శర్మ దేశానికి అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. ప్రతీ టోర్నమెంట్‌లో అభిమానులు ఇచ్చే సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేమన్నాడు.
న్యూజిలాండ్‍తో జరిగిన ఫైనల్‍లో లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అర్ధ శకతంతో గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. గతేడాది రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది. అప్పుడు టీ20 ఫార్మాట్‍కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటారంటూ రూమర్లు వచ్చాయి. వన్డేల నుంచి తాను రిటైర్ అవడం లేదని రోహిత్ శర్మ చెప్పేశాడు. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ పై ఈ దిగ్గజ ఆటగాళ్లు కన్నేశారని తెలుస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీ ముగియగానే రోహిత్ , కోహ్లీ , జడేజా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. కానీ వన్డేల్లో మరికొంతకాలం వీరు కొనసాగడం ఖాయమైంది. ఇదిలా ఉంటే 2024 టీ20 ప్రపంచకప్ లో కెప్టెన్ గా జట్టును గెలిపించిన రోహిత్.. ఏడాది తిరగకముందే మరో ఐసీసీ టోర్నీని ఖాతాలో వేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ అన్ని రకాలుగా సత్తాచాటాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా మెరిశాడు. కీలకమైన ఫైనల్లో రోహిత్ 76 పరుగులు చేయడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.