Venkatesh Iyer : అయ్యర్ సెల్ఫిష్‌కు రస్సెల్ బలి…
క్రికెట్‌లో టీమ్ (Cricket Team) లా ఆడితేనే గెలుస్తారు.. సెల్ఫిష్ అనే పదానికి తావు ఉండకూడదు.. అయితే ప్రస్తుత ఐపీఎల్ (IPL) లో మాత్రం పలువురు ప్లేయర్స్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
క్రికెట్‌లో టీమ్ (Cricket Team) లా ఆడితేనే గెలుస్తారు.. సెల్ఫిష్ అనే పదానికి తావు ఉండకూడదు.. అయితే ప్రస్తుత ఐపీఎల్ (IPL) లో మాత్రం పలువురు ప్లేయర్స్ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో మ్యాచ్‌లో ధోని సింగిల్ తీసే అవకాశమున్నా మిఛెల్‌కు స్ట్రైకింగ్ ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి.
తాజాగా ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) కూడా సెల్ఫిష్‌గా వ్యవహరించాడు. 17వ ఓవర్ చివరి బంతిని రన్ తీసేందుకు కాల్ ఇవ్వగా.. నాన్ స్ట్రైకర్ రస్సెల్ దాదాపుగా మరో ఎండ్ వైపు వచ్చేశాడు. అయితే అనూహ్యంగా వెంకటేష్ అయ్యర్ వెనక్కి వెళ్లిపోవడంతో రస్సెల్ తిరిగి మళ్లీ నాన్‌స్ట్రైకింగ్ వైపు పరిగెత్తాల్సి వచ్చింది. అప్పటికే ఫీల్డర్ త్రో ఇవ్వడంతో రస్సెల్ రనౌటయ్యాడు.
దీంతో అయ్యర్ చేసిన పనికి రస్సెల్ బలయ్యాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చాలా ఈజీగా సింగిల్ వచ్చేదని చెబుతున్నారు. ఫీల్డర్ ఉన్నాడని ముందే చూసుకోకుండా.. రన్ కోసం కాల్ చేసి మళ్లీ వెనక్కి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రస్సెల్ ఏమైనా టెయిలెండరా, సెల్ఫిష్ గేమ్ ఆడొద్దంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో అయ్యర్ 52 బంతుల్లో 70 పరుగులు చేయగా… కోల్‌కతా 24 పరుగుల తేడాతో గెలిచింది.