Ruthuraj Gaikwad’s : రుతురాజ్ అరుదైన రికార్డ్

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేస్ రసవత్తరంగా మారింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) కి చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) సవాల్ విసురుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2024 | 03:27 PMLast Updated on: May 02, 2024 | 3:27 PM

Ruthuraj Gaikwads Rare Record In 2024 Ipl

 

 

 

ఐపీఎల్ (IPL) 17వ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేస్ రసవత్తరంగా మారింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) కి చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruthuraj Gaikwad) సవాల్ విసురుతున్నాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రుతురాజ్‌ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కోహ్లీని వెనక్కి నెట్టి అత్యధిక పరుగుల జాబితాలో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఈ చెన్నై కెప్టెన్ 10మ్యాచ్‌ల్లో 63 సగటుతో 509 పరుగులు చేసి ఈ సీజన్‌లో హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ క్రమంలో అతను అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 500 ప్లస్ స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి కెప్టెన్‌గా రుతురాజ్ రికార్డులకెక్కాడు. ఈ సీజన్‌ ఆరంభానికి ముందు ధోనీ తప్పుకోవడంతో రుజరాత్ చెన్నై సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం కోహ్లీ 500 పరుగులతో రెండో స్థానంలో ఉండగా…గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయిసుదర్శన్ 418 రన్స్‌తో మూడో ప్లేస్‌లో ఉన్నాడు. కాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఓడిపోయింది. అనుకున్నంత స్కోరు చేయకపోవడం, బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో చెన్నై ఐదో పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది.