Sachin Tendulkar: మురళి బయోపిక్ ట్రైలర్.. సచిన్ ఏం మాట్లాడబోతున్నాడు..!
మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ , మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

Sachin Tendulkar: లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ‘800’ పేరుతో బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ , మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా ‘800’ ట్రైలర్ రేపు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. సచిన్ టెండూల్కర్ ఇటు ఇండియా తరఫున, ముత్తయ్య మురళీధరన్ అటు శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు.
వీళ్ళిద్దరూ మైదానంలో పోటీ పడినప్పటికీ.. మైదానం వెలుపల మంచి స్నేహితులు. మురళీధరన్ కోసం ‘800’ ట్రైలర్ విడుదల చేయడానికి సచిన్ ఒకే చెప్పడంతో, క్రికెట్ అభిమానులు ఒకింత పులకరింతకు గురవుతూ, ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.