చివరి బంతికి సిక్సర్ మ్యాచ్ గెలిపించిన సఫారీ ప్లేయర్

క్రికెట్ లో చివరి బంతికి సిక్సర్ కొడితే ఆ కిక్కే వేరు.. అదే సిక్సర్ తో మ్యాచ్ గెలిస్తే అంతకుమించిన మజా ఏముంటుంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 05:45 PMLast Updated on: Aug 31, 2024 | 5:45 PM

Safari Player Who Won The Match

క్రికెట్ లో చివరి బంతికి సిక్సర్ కొడితే ఆ కిక్కే వేరు.. అదే సిక్సర్ తో మ్యాచ్ గెలిస్తే అంతకుమించిన మజా ఏముంటుంది.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. బార్బుడా ఫాల్కన్స్‌, గయానా అమెజాన్ వారియర్స్ మధ్య చివరి వ‌ర‌కు సాగిన మ్యాచ్ అభిమానుల‌ను ఉత్కంఠతో ఊపేసింది. స‌ఫారీ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ ప్రిటోరియ‌స్ . చివ‌రి బంతికి సిక్స్ కొట్టి అమెజాన్ వారియర్స్ ను గెలిపించాడు. చివరి ఓవర్లో విజయం కోసం 16 ప‌రుగులు చేయాల్సి ఉండగా తొలి బంతికి పరుగులేమీ రాలేదు. అయితే ప్రిటోరియస్ నాలుగు బంతులకు మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను మ‌లుపు తిప్పాడు. మరో 4 రన్స్ కావాల్సి ఉండగా.. చివరి బంతికి సిక్సర్ కొట్టి విజయాన్ని పూర్తి చేశాడు.