కౌంటీల్లో సాయిసుదర్శన్ జోరు శతక్కొట్టిన యువ క్రికెటర్

భారత యువ క్రికెటర్ కౌంటీ క్రికెట్ లో సాయిసుదర్శన్ దుమ్ము రేపుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2024 | 05:23 PMLast Updated on: Aug 31, 2024 | 5:23 PM

Saisudarshan Century In County Championship

భారత యువ క్రికెటర్ కౌంటీ క్రికెట్ లో సాయిసుదర్శన్ దుమ్ము రేపుతున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీ టీమ్ స‌ర్రే క్రికెట్ క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఈ తమిళనాడు క్రికెటర్ తొలి శతకం సాధించాడు. నాటింగ్‌హామ్‌షైర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సాయిసుద‌ర్శ‌న్ అద్బుతమైన‌ సెంచ‌రీతో అదరగొట్టాడు. 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 105 పరుగులు చేసిన సాయిసుదర్శన్ సిక్సర్ తో సెంచరీ మార్కు అందుకున్నాడు.
కౌంటీల్లో సుద‌ర్శ‌న్ ఆడ‌టం ఇదే రెండో సారి. గ‌తేడాది కౌంటీ ఛాంపియ‌న్ షిప్‌లో ఆఖ‌రి మూడు మ్యాచ్‌ల్లో స‌ర్రే త‌ర‌పున ఆడాడు. అయితే ఈ ఏడాది కొన్ని కౌంటీ మ్యాచ్ లకే అందుబాటులో ఉంటాడు. సెప్టెంబ‌ర్ 5 నుంచి జరిగే దులీప్ ట్రోఫీలో సాయిసుదర్శన్ బరిలోకి దిగుతాడు.