Nepal: ఆసియా కప్ 2023.. నేపాల్ ఆటగాళ్ల జీతాలు అంత తక్కువా..?
భారతదేశం లేదా ఇతర దేశాల మాదిరిగానే, నేపాల్ క్రికెట్ బోర్డు కూడా తన ఆటగాళ్లతో వార్షిక ఒప్పందాలు చేసుకుంటుంది. వారిని 3 కేటగిరీలుగా విభజించి దానికి అనుగుణంగా జీతం ఇస్తుంది. ఏ గ్రేడ్‌లో చేరిన క్రికెటర్లు ప్రతి నెలా 60 వేల నేపాల్ రూపాయల జీతం పొందుతారు.
Nepal: భారత క్రికెటర్ల జీతం లక్షలు, కోట్లలో ఉంటుంది. కానీ, నేపాల్ క్రికెటర్ల విషయం అలా కాదు. వారి జీతం టీమిండియా అసిస్టెంట్ స్టాఫ్‌కు ఇచ్చే జీతం కంటే చాలా తక్కువగా ఉంది. నేపాల్ జట్టు తొలిసారిగా ఆసియా కప్ ఆడుతోంది. ఇది వారికి పెద్ద అచీవ్‌మెంట్ కానుంది. భారతదేశం లేదా ఇతర దేశాల మాదిరిగానే, నేపాల్ క్రికెట్ బోర్డు కూడా తన ఆటగాళ్లతో వార్షిక ఒప్పందాలు చేసుకుంటుంది. వారిని 3 కేటగిరీలుగా విభజించి దానికి అనుగుణంగా జీతం ఇస్తుంది.
ఏ గ్రేడ్‌లో చేరిన క్రికెటర్లు ప్రతి నెలా 60 వేల నేపాల్ రూపాయల జీతం పొందుతారు. బి గ్రేడ్‌లో ఉన్న వారికి రూ.50 వేలు, గ్రేడ్ సిలో ఉన్న వారికి రూ.40 వేలు అందజేస్తారు. నేపాల్‌లో 60,000 వేతనం పొందుతున్న క్రికెటర్ల విలువ భారతదేశంలో రూ.37,719లు మాత్రమే. అదేవిధంగా 50,000 నేపాలీ రూపాయల విలువ కేవలం రూ.31,412లు మాత్రమే. మరోవైపు 40000 నేపాలీ రూపాయలు పొందే నేపాలీ క్రికెటర్లకు భారత కరెన్సీలో కేవలం రూ.25 వేలు మాత్రమే ఉంటుంది.
సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం నెలవారీ జీతం కాకుండా, నేపాల్ క్రికెటర్లకు ఒక వన్డే ఆడినందుకు 10000 నేపాలీ రూపాయలు, T20 మ్యాచ్ ఆడినందుకు 5000 నేపాలీ రూపాయిలను అందుకుంటాడు. అంటే భారత కరెన్సీ ప్రకారం, వారు ఒక ODIకి రూ.6286, ఒక T20కి రూ.3143 పొందుతారు. డబ్బు తక్కువే కానీ నేపాలీ క్రికెటర్ల ఉద్దేశం మాత్రం బలంగా ఉంటుంది.