కెఎల్ రాహుల్ పై అదే సస్పెన్స్ లక్నో రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పాత ఫ్రాంచైజీలను వీడేందుకు రెడీ అవుతున్న ప్లేయర్స్ ను కొన్ని టీమ్స్ రిటైన్ చేసుకుంటుంటే... మరికొన్ని ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు.
ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పాత ఫ్రాంచైజీలను వీడేందుకు రెడీ అవుతున్న ప్లేయర్స్ ను కొన్ని టీమ్స్ రిటైన్ చేసుకుంటుంటే… మరికొన్ని ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కెెఎల్ రాహుల్ పై అదే సస్పెన్స్ కొనసాగిస్తోంది. కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకోవడం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రాహుల్‌ను రిటైన్ చేసుకోవాలా లేదా ఆర్‌టీఎమ్ కార్ద్ ద్వారా దక్కించుకోవాలా అనే సందిగ్ధతలో ఫ్రాంచైజీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా రాహుల్ లక్నోకు గుడ్ బై చెప్పి వేలంలోకి వస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా గత సీజన్ సమయంలో రాహుల్ పై గ్రౌండ్ లోనే ఆగ్రహం వ్యక్తం చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో భారీస్కోరు చేసినా ఓడిపోవడంతో సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనానికి లోనై మైదానంలోనే రాహుల్ పై ఫైర్ అయిన వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.
అయితే కేఎల్ రాహుల్‌ను వేలంలోకి పంపి తిరిగి దక్కించుకోవాలని చూస్తే లక్నో పెద్ద మొత్తంలో కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రాహుల్ కోసం వేలంలో ఆర్సీబీ తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది. మరోవైపు లక్నో రిటెన్షన్ జాబితాను చూస్తే నికోలస్ పూరన్ పేరు ఖాయంగా కనిపిస్తోంది. షార్ట్ ఫార్మాట్ లో గత కొంతకాలంగా విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడుతున్న పూరన్ ను లక్నో ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోదు. గత సీజన్ లో పూరన్ 3 హాఫ్ సెంచరీలతో 499 రన్స్ చేశాడు. ఇక అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్‌ను రిటైన్ చేసుకోవాలని లక్నో ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. వీరిద్దరూ 2022 నుంచి లక్నో ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నారు. ఇక స్పీడ్ సంచలనం మయాంక్ యాదవ్ ను రిటైన్ లేదా ఆర్టీఎం ఆప్షన్ ద్వారా దక్కించుకోవడం ఖాయమైంది.
గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. 14 మ్యాచ్ లలో 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగా వేలం కోసం బీసీసీఐ రూల్స్ ప్రకారం గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. వారికి నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవడం లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకునే అవకాశాలను కల్పించింది. రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు అక్టోబర్ 31వ తేదీని డెడ్ లైన్ గా ప్రకటించింది.