కోచ్ పదవికి జయసూర్య గుడ్ బై

టీమిండియాపై వన్డే సిరీస్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. కోచ్ గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సనత్ జయసూర్య తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ తర్వాత అతడు కోచింగ్ నుంచి తప్పుకొని లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో బిజీ కానున్నాడు. లంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు జయసూర్య తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలను చేపట్టాడు. కాగా జయసూర్య ఇచ్చిన సూచనల వల్లే టీమిండియాపై శ్రీలంక విజయం సాధించగలిగింది. భారత్‌పై గెలవగలమనే భరోసాను ఇచ్చి టీంను ముందుకు నడిపించాడు. ఇది వర్కౌట్ అయ్యి భారత్‌పై శ్రీలంక గెలిచింది. ఇప్పుడు జయసూర్య స్థానంలో లంక బోర్డు కొత్త కోచ్ ను నియమించనుంది.