రాజస్థాన్ కు సంగక్కర గుడ్ బై ? కేకేఆర్ మెంటార్ గా వెళ్ళే ఛాన్స్
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ పై ఫోకస్ పెట్టాయి.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ పై ఫోకస్ పెట్టాయి. పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే మార్పులు చేసుకున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఆ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పేరు ఖరారు కావడంతో సంగక్కరాకు కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. దీనిపై సంగక్కరా కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. గత సీజన్‌లో కోల్ కతా మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్.. ఆఫ్రాంచైజీని వీడి భారత్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో అతడి స్ధానాన్ని భర్తీ చేసే క్రమంలోనే సంగక్కరతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సంగక్కరా మెంటార్ గా ఉన్న రాజస్థాన్ 2022 సీజన్ లో ఫైనల్ కు చేరింది.