Sania comments on Shoib: షోయబ్ కు అమ్మాయిల పిచ్చి.. అందుకే వదిలేసా ! సానియా సంచలన నిజాలు
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోవడానికి అసలు కారణం…. షోయబ్ కి అమ్మాయిల పిచ్చి. సానియా కన్నుగప్పి చాలామంది అమ్మాయిలతో షోయబ్ వ్యవహారాలు నడిపాడు. చాలాసార్లు సానియా అతడిని హెచ్చరించిన తీరు మారలేదు. మాలిక్ తనను మోసం చేసినందునే విడిపోవాల్సి వచ్చిందని సానియా సన్నిహితుల దగ్గర వాపోయిందట.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోవడానికి అసలు కారణం…. షోయబ్ కి అమ్మాయిల పిచ్చి. సానియా కన్నుగప్పి చాలామంది అమ్మాయిలతో షోయబ్ వ్యవహారాలు నడిపాడు. చాలాసార్లు సానియా అతడిని హెచ్చరించిన తీరు మారలేదు. మాలిక్ తనను మోసం చేసినందునే విడిపోవాల్సి వచ్చిందని సానియా సన్నిహితుల దగ్గర వాపోయిందట.
పాకిస్తాన్ నటి సనా జావేద్, షోయబ్… మూడేళ్లుగా రహస్యంగా కలుసుకుంటూనే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని సానియా చెప్పిందట. నిజానికి షోయబ్, సానియా.. కొద్ది నెలల కిందటే విడాకులు తీసుకున్నారు. మరోవైపు మూడో పెళ్లి చేసుకోవడం షోయబ్ కుటుంబసభ్యులకు ఇష్టంలేనట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా వీరిద్దరి విడాకులపై ప్రచారం జరుగుతున్నా.. షోయబ్ తన మూడో పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో.. సానియా నుంచి అతడు విడిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయని సానియా కుటుంబం.. ఇప్పుడు స్పందించింది. షోయబ్ పెళ్లిపై సానియా కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. సానియా వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ గోప్యంగానే ఉంచుకుందని ప్రకటించింది. వీరిద్దరూ కొద్ది నెలల కిందటే విడాకులు తీసుకున్నారని తెలిపింది సానియా కుటుంబం. మరో పెళ్ళి చేసుకున్న షోయబ్ కొత్త ప్రయాణం బాగుండాలని సానియా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిందని ఆమె తరఫున ప్రకటన వెలువడింది.
షోయబ్, సానియా విడిపోవడానికి గల స్పష్టమైన కారణం షోయబ్ అక్రమ సంబంధాలే. అయితే, వీరిద్దరి విడాకులు రెండు కుటుంబాలకు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడం… అతడి కుటుంబ సభ్యులకే నచ్చనట్లు సమాచారం. దీంతో ఆ పెళ్లికి వారంతా దూరంగా ఉన్నారు. ఇప్పటికే విడాకులు తీసుకున్న సనా జావెద్‌ను మాలిక్ వివాహం చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. సానియాతో విడాకులు తీసుకోవడం కూడా మాలిక్ సోదరికి నచ్చలేదు. ఇదంతా మాలిక్ వివాహేతర సంబంధాల వల్లేనని అతని కుటుంబ సభ్యులు కూడ బాధ పడుతున్నారు.
2010లో సానియాను నిఖా చేసుకున్నాడు షోయబ్. వీరికి ఇజాన్ అనే నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, కొంతకాలం నుంచి సానియా, షోయబ్ మధ్య మనస్ఫర్థలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఎవరి దేశంలో వారు ఉండటం, దూరం పెరగడం కూడా విభేదాలను మరింత పెంచాయని అర్థమవుతోంది.