Sania delete Shoib Photos:సానియా-షోయబ్ విడాకులేనా ? అందుకే ఆ ఫోటోలు తీసేసిందా ?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ నటి, మోడల్ ఆయేషా ఓమర్ తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు పాకిస్థాన్ మీడియా కథనాలు రాసింది. షోయబ్ – ఆయేషా కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అందుకే షోయబ్ – సానియా మధ్య బంధం చెడిపోయిందని పాక్ మీడియా తెలిపింది
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా – పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Sania Mirza-Shoib Malik) త్వరలో విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షోయబ్ మాలిక్ ను ప్రేమించిన సానియా మీర్జా 2010లో పెళ్ళి చేసుకుంది. వీళ్ళకి ఇజాజ్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఈమధ్య కాలంలో సానియా – షోయబ్ వివాహ బంధం సరిగా లేదనీ… త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇవి పుకర్లా… లేక నిజమేనా అన్నదానిపై ఇద్దరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు షోయబ్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి సానియా తొలగించడంతో ఈ వార్తలకు బలం చేకూరిందని అంటున్నారు నెటిజెన్స్
ఒకప్పుడు టెన్నిస్ లో సానియామీర్జా సంచలనం. వరుస రికార్డులతో భారత్ పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగేలా చేసింది. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ విషయంలో… భర్త షోయబ్ తో విభేదాలతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సానియా మీర్జా కొంతకాలంగా పాకిస్తాన్ వెళ్ళడం లేదు. ఇండియాలోనే ఎక్కువగా ఉంటోంది. లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ నుంచి భర్త షోయబ్ తో కలసి ఉన్న ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేసింది. గతంలోనే షోయబ్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో రిలేషన్షిప్ స్టేటస్ నుంచి సానియా మీర్జా పేరు తొలగించాడు. షోయబ్ అప్పట్లో….తాను సూపర్ ఉమెన్ సానియా మీర్జా భర్తను అని గర్వంగా చెప్పుకుంటూ రిలేషన్షిప్ స్టేటస్ పెట్టాడు. ఇన్ స్టా గ్రామ్ లోనూ ఫోటోలను తీసేశాడు. సానియా – షోయబ్… ఇద్దరూ కలసి ఉన్న ఫోటోలను జనరల్ గా ఒకేసారి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. కానీ చివరిసారిగా కొడుకు బర్త్ డే ఫోటోల్లో మాత్రమే ఇద్దరూ కలసి కనిపించారు. ఆ తర్వాత ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు. దాంతో సానియా – షోయబ్ మధ్య రిలేషన్ దెబ్బతిన్నదని అర్థమవుతోంది. అందుకే ఇద్దరూ సోషల్ మీడియాలో అకౌంట్స్ లో ఫోటోలు తొలగించారని నెటిజన్స్ చెబుతున్నారు. తొందర్లోనే వీళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకుంటారని తెలుస్తోంది.
షోయబ్… తన భార్య సానియా మీర్జాను మోసం చేశాడనీ… పాకిస్తాన్ నటి, మోడల్ ఆయేషా ఓమర్ (Ayesha Omar)తో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు పాకిస్థాన్ మీడియా కథనాలు రాసింది. షోయబ్ – ఆయేషా కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అందుకే షోయబ్ – సానియా మధ్య బంధం చెడిపోయిందని పాక్ మీడియా తెలిపింది. ఆయేషా మాత్రం అవన్నీ పుకార్లే అనీ… పెళ్ళయిన వ్యక్తితో ఎలా సంబంధం పెట్టుకుంటానని ప్రశ్నించింది. ఆ ఫోటోలు ఓ షూట్ సందర్భంగా దిగినట్టు వివరణ ఇచ్చింది ఆయేషా. ఈ ఫోటోల తర్వాతే సానియా మనసు మరింత గాయపడినట్టు… ఈమధ్య సానియా మీర్జా చేసిన ఓ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. ఒక విషయం మనసుకు బాధ కలిగిస్తున్నప్పుడు… దాన్ని దూరం చేసుకోవడమే మేలు… అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీన్ని బట్టే షోయబ్ తో తెగతెంపులకు సానియా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే… అతి తొందర్లనే వీళ్ళ వివాహ బంధం క్లీన్ బౌల్డ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.