Sania Mirza: ఎంత కష్టం.. పాపం.. సానియా కుమారుడికి వేధింపులు..
తల్లిదండ్రుల విడాకులు.. తండ్రి మూడవ పెళ్లి.. సానియా, షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది. తను డిస్టర్బ్ అవడమే కాకుండా.. స్కూలు నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా సానిమా మీర్జా బయటపెట్టింది.
Sania Mirza: సానియా, షోయబ్ విడాకులపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. తప్పు ఎవరి వైపు ఉంది అన్న సంగతి ఎలా ఉన్నా విడిపోవడం మాత్రం జరిగిపోయింది. సానియాకు డివోర్స్ ఇచ్చిన షోయబ్ మాలిక్.. మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఐతే తల్లిదండ్రుల విడాకులు.. తండ్రి మూడవ పెళ్లి.. సానియా, షోయబ్‌ల కొడుకు ఇహాన్‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది. తను డిస్టర్బ్ అవడమే కాకుండా.. స్కూలు నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు.. సుప్రీంకోర్టులో విచారణ 16కు వాయిదా..?
ఈ విషయాన్ని స్వయంగా సానిమా మీర్జా బయటపెట్టింది. షోయబ్ మాలిక్ రెండు వారాల కింద పాకిస్తానీ నటి సనా జావేద్‌ను మూడవ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి పెళ్లి వార్త అందర్నీ షాక్‌కి గురి చేసింది. షోయబ్ మొదటి పెళ్లి అయేషా సిద్ధికీతో జరిగింది. వారి విడాకుల తర్వాత 2010లో సానియా మీర్జాను షోయబ్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరి విడాకుల వార్తను సానియా తండ్రి కన్ఫమ్ చేశారు. కాగా వీరిద్దరి విడాకులు.. షోయబ్ 3వ పెళ్లి వార్తలతో ఇహాన్ తన పాఠశాలలో వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. నయీమ్ హనీఫ్ అనే పాకిస్తానీ జర్నలిస్టు తన కుమారుడి మానసిక ఆరోగ్యంపై సానియా ఆందోళన వ్యక్తం చేశారని.. తన తండ్రి మూడవ పెళ్లి వార్త ఇహాన్‌ను మానసిక క్షోభకు గురి చేశాయని అన్నారు.
ఐతే దీని గురించి వాస్తవం తెలియాల్సి ఉంది. అయితే దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. భార్యభర్తలు విడిపోతే ఆ ప్రభావం బిడ్డలపై పడుతుందని.. అందుకే పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని భార్యభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలుస్తూ… తల్లిదండ్రులుగా వారి బాధ్యతలు నిర్వర్తించాలని అంటున్నారు. మరోవైపు సానియా త్వరలో తన స్వస్థలమైన హైదరాబాద్‌కు తిరిగి వస్తారంటూ వార్తలు వస్తున్నాయ్.