ROHIT SHARMA: రోహిత్ శర్మపై మాజీ కోచ్ ప్రశంసలు
ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తెగ మెచ్చుకున్నాడు. టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా సేవలు అందించిన బంగర్.. ఆటగాళ్లపై రోహిత్ నమ్మకం పెట్టిన విధానానికి ఫిదా అయిపోయాడట.
ROHIT SHARMA: ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీం టీమిండియా ఆడిన 8 మ్యాచుల్లో ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సెమీస్ చేరుకుంది. చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (ROHIT SHARMA)ను మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ తెగ మెచ్చుకున్నాడు.
Glenn Maxwell: మ్యాక్సీ.. నువ్ మనిషివేనా.. ఆఫ్గన్‌పై రికార్డ్ డబుల్ సెంచరీ..!
టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా సేవలు అందించిన బంగర్.. ఆటగాళ్లపై రోహిత్ నమ్మకం పెట్టిన విధానానికి ఫిదా అయిపోయాడట. ముఖ్యంగా గాయాలతో జట్టుకు చాలాకాలం దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్.. ఈ ముగ్గురూ మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమే అని అంతా అనుకున్నారు. వీరిలో బుమ్రా ఏకంగా ఏడాదికిపైగా ఆటకు దూరమయ్యాడు. చివరకు ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఇక శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో ఐపీఎల్ ముందు నుంచే జట్టుకు దూరమవగా.. ఐపీఎల్‌లో గాయపడిన కేఎల్ రాహుల్ కూడా ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వీరిద్దరినీ ఆసియా కప్‌లోనే ఆడిన టీంలోకి రోహిత్ తీసుకున్నాడు. తమపై కెప్టెన్ ఉంచిన నమ్మకాన్ని వీళ్లు ముగ్గురూ నిరూపించుకున్నారు. ‘గాయాల నుంచి కోలుకొని పూర్తి కాన్ఫిడెన్స్ లేని ప్లేయర్లకు రోహిత్ మద్దతుగా నిలిచాడు. బుమ్రా, శ్రేయాస్, కేఎల్ ముగ్గురూ కూడా టీంలో కీలకమైన వాళ్లనే నమ్మకం కలిగించాడు. వాళ్ల సత్తాపై తమకు నమ్మకం ఉందని, వాళ్లకు ఎన్ని అవకాశాలైనా ఇస్తామని ఒక సందేశం పంపాడు. దాంతో దైర్యం తెచ్చుకున్న వాళ్లు చెలరేగుతున్నారు’ అని బంగర్ అన్నాడు.