ఇంకా రెస్ట్ కావాలా ? కోహ్లీ,రోహిత్ లపై మంజ్రేకర్ ఫైర్

టీమిండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ సిరీస్ లు ఏమీ లేవు. సెప్టెంబర్ రెండో వారం తర్వాత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2024 | 08:35 PMLast Updated on: Aug 28, 2024 | 8:35 PM

Sanjay Manjrekar Fired Over Virat And Rohit

టీమిండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ సిరీస్ లు ఏమీ లేవు. సెప్టెంబర్ రెండో వారం తర్వాత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. మరికొందరు బుచ్చిబాబు టోర్నీతో పాటు ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో బరిలోకి దిగారు. అయితే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బూమ్రా మాత్రం దులీప్ ట్రోఫీ ఆడడం లేదు. మొదట ఆడతారని వార్తలు వచ్చినప్పటకీ బీసీసీఐ ఇచ్చిన మినహాయింపుతో రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా కోహ్లీ, రోహిత్ , బూమ్రా దేశవాళీ క్రికెట్ కు దూరంగా ఉండడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించాడు. వారికి ఇంకెంత కాలం విశ్రాంతినిస్తారంటూ బీసీసీఐ సెలక్టర్లను ప్రశ్నించాడు.

గతంలో వాళ్లు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్ గణాంకాలను వివరిస్తూ ఎంతో విశ్రాంతి లభించిందని చెప్పాడు. దులీప్ ట్రోఫీ ఆడాలని ట్వీట్ చేశాడు. గత అయిదేళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే…వాటిలో రోహిత్ శర్మ 59 శాతం , కోహ్లి 61 శాతం మ్యాచ్‌లు ఆడినట్టు చెప్పుకొచ్చాడు. అలాగే బుమ్రా 34 శాతం మ్యాచ్‌లు ఆడాడని గుర్తు చేశాడు. ఈ ముగ్గురూ కూడా దులీప్ ట్రోఫీలో ఆడాల్సిందని చెప్పాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దృష్ట్యా ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన పనిలేదంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.