Sanju Samson: సంజూ నీకు టైమొచ్చింది.. మెగా టోర్నీలో రెచ్చిపో
ఐపీఎల్లో మాత్రం దుమ్మురేపుతూనే ఉన్నాడు. ఈ సీజన్ లోనూ పరుగుల వరద పారీస్తున్నాడు.మొత్తానికి అతడి అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. వరల్డ్ కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది సంజూ కల నెరవేరే సమయం వచ్చింది.
Sanju Samson: సంజూ శాంసన్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 9 ఏళ్ల కిందే ఈ కేరళ బ్యాటర్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే కెరీర్ మొదట్లో అంతగా అవకాశాలు రాలేదు. వచ్చిన కొన్నింటినీ అతడు సరిగ్గా యూజ్ చేసుకోలేదు. దీంతో మధ్యలో కొన్నిసార్లు టీమ్‌లోకి వచ్చినా పూర్తిగా సెటిల్ కాలేకపోయాడు. ఎప్పుడు జట్టులో ఉంటాడో? ఎప్పుడు తీసేస్తారో? చెప్పలేని పరిస్థితి.
BJP OUT MANIFESTO: బీజేపీ బొమ్మ మాయం.. కూటమి మేనిఫెస్టో బీజేపీకి ఇష్టం లేదా..?
అయితే ఐపీఎల్లో మాత్రం దుమ్మురేపుతూనే ఉన్నాడు. ఈ సీజన్ లోనూ పరుగుల వరద పారీస్తున్నాడు.మొత్తానికి అతడి అభిమానుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. వరల్డ్ కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది సంజూ కల నెరవేరే సమయం వచ్చింది. టీ20 వరల్డ్ కప్ జట్టులో సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో ఆడే టీమ్ కి ఎంపికయ్యాడు. ఎంతో కీలకమైన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్లేస్ కోసం రిషభ్ పంత్, సంజు శాంసన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, దినేష్ కార్తీక్ పోటీ పడ్డారు. వీరిలో రిషభ్ పంత్ ఫస్ట్ ఛాయిస్‌గా తీసుకున్న సెలెక్టర్లు రెండో చాయిస్‌గా సంజూని ఎంపిక చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో వికెట్ కీపర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంజు.. బ్యాటర్‌గా అంతకు మించి రాణిస్తున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సంజు 77 యావరేజ్, 161.09 స్ట్రైక్‌రేట్‌తో 385 పరుగులు చేశాడు. అందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 82 రన్స్‌గా ఉంది. అలాగే 36 ఫోర్లు, 17 సిక్సులతో సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంత మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడిన ఎంపిక చేయకుండా పక్కనపెడితే.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా చాలా నష్టపోవాల్సి వస్తుందని క్రికెట్ అభిమానులు , మాజీ ప్లేయర్స్ సైతం అభిప్రాయపడ్డారు. చివరికి బీసీసీఐ సెలెక్టర్లు సంజూ శాంసన్ ను ఎంపిక చేయడంతో అతనికి న్యాయం జరిగిందని సంబరపడుతున్నారు.