Sanju Samson: రోహిత్‌ను ధోని గుర్తించాడు.. సంజూ.. నీకెవరున్నారు?
సంజూ టాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటే.. అతన్ని టాప్ ఆర్డర్‌లో ఆడించాలి. ఏ ఫార్మాట్ అయినా సరే అతన్ని టాప్ ఆర్డర్‌లోనే ఆడించాలి. సంజూ టాలెంట్‌కు న్యాయం చేయాలంటే అంతకుమించి మరో మార్గం లేదు. అతన్ని టాప్ ఆర్డర్‌లో ఆడించాలి.
Sanju Samson: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీసులో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఈ సిరీసులో ముఖ్యంగా కేరళ యంగ్‌స్టర్ సంజూ శాంసన్ విఫలం కావడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సంజూకు టీమిండియాలో అవకాశాలు రావడమే అరుదని, అలాంటి అవకాశాలు వస్తే వాటిని వృథా చేసుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. సంజూను కూడా రోహిత్ శర్మలాగే టాప్ ఆర్డర్‌లో ఉపయోగించుకోవాలని సూచించాడు.
‘సంజూ టాలెంట్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటే.. అతన్ని టాప్ ఆర్డర్‌లో ఆడించాలి. ఏ ఫార్మాట్ అయినా సరే అతన్ని టాప్ ఆర్డర్‌లోనే ఆడించాలి. సంజూ టాలెంట్‌కు న్యాయం చేయాలంటే అంతకుమించి మరో మార్గం లేదు. అతన్ని టాప్ ఆర్డర్‌లో ఆడించాలి. ఒక విధంగా రోహిత్ శర్మ విషయంలో కూడా టీమిండియా చేసిందదే’ అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ను కెరీర్ ఆరంభంలో మిడిల్, లోయర్ ఆర్డర్‌లో ఆడించారు. కానీ సెహ్వాగ్, గంభీర్ రిటైర్ అయిన తర్వాత ధోనీ అతన్ని ఓపెనర్‌గా ఆడించాడు. ఈ రోల్‌లో సక్సెస్ అయిన రోహిత్ వైట్ బాల్ క్రికెట్‌లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. బెస్ట్ ఓపెనర్లలో తను ఒకడని నిరూపించుకున్నాడు అని చోప్రా గుర్తుచేశాడు. ‘రోహిత్‌లో చాలా సత్తా ఉందని అనిపించేది. అందుకే అతనికి అన్ని అవకాశాలు ఇచ్చారు.
సంజూ విషయంలో కూడా ఇప్పుడు కనిపిస్తున్న టాలెంట్.. ఫ్యూచర్‌లో పెర్ఫామెన్స్‌గా మారే అవకాశం ఉంది’ చోప్రా అన్నాడు. అయితే ప్రస్తుతం అతన్ని టాప్ ఆర్డర్‌లో ఆడించడం కుదరకపోవచ్చని కూడా చోప్రా అభిప్రాయపడ్డాడు. కానీ సంజూకు ఇంకా 29 ఏళ్లు కూడా లేవని, సీనియర్లు తప్పుకున్న తర్వాత ఫ్యూచర్ అంతా తనదేనని చెప్పుకొచ్చాడు. సంజూ ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో రాణిస్తున్నాడని, ఆ నెంబర్లు చూసి అతన్ని జట్టులోకి తీసుకుంటున్నామని చోప్రా అన్నాడు. కానీ జట్టులో అతన్ని లోయర్ ఆర్డర్‌లో ఆడిస్తే ఫలితం ఏంటని ప్రశ్నించాడు.