WORLD CUP 2023: నీకు నేనున్నా బంగారం.. సారా టెండూల్కర్ ట్వీట్ ఎవరి గురించి..?
శుభ్‌మన్ గిల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గిల్ ప్లేట్లెట్ల సంఖ్య 70 వేలకు తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా అతడిని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జయ్యాడు.

WORLD CUP 2023: భారత బ్యాటర్ శుభమన్ గిల్ గత కొంతకాలంగా ఆటతోనే కాదు డేటింగ్ రూమర్స్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల ట్వీట్స్ చూస్తే.. గిల్-సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని అనుకోకుండా ఉండలేరు. శుభ్‌మన్ గిల్ గత కొన్ని రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
గిల్ ప్లేట్లెట్ల సంఖ్య 70 వేలకు తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా అతడిని చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జయ్యాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా మ్యాచ్‌కు దూరమయిన అతడు నేడు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ ఆడడం లేదు. ఇక శనివారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ దూరమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో గిల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా గిల్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘డోంట్ వర్రీ బేబీ.. నువ్ బలంగా తిరిగొస్తావ్’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.