Sarfraz Khan ranji century , BCCI : సర్ఫరాజ్ కు పిలుపు వచ్చిందోచ్… రెండో టెస్టుకు ఎంపికైన ముంబై క్రికెటర్
దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరగున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

Sarfaraz got a call... The Mumbai cricketer was selected for the second Tests
దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు భారత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరగున్న రెండో టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో దీంతో చాలా కాలంగా సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించినట్టైంది. గాయల కారణంగా రెండో టెస్టుకు స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు యూపీ ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరు ముగ్గురు నేరుగా విశాఖపట్నంలో భారత జట్టుతో కలవనున్నారు.
గత కొంత కాలంగా సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీల్లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 45 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 69.85 సగటుతో 3,912 రన్స్ చేశాడు. దీనిలో 14 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు, ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ముంబై ప్లేయర్ ఇండియా-ఎ జట్టు తరపున కూడా అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
దీంతో సర్ఫరాజ్‍ను భారత టెస్టు జట్టులోకి తీసుకోవాలని కొంతకాలంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ టీమ్‍తో జరిగిన అనధికార టెస్టులో ఇండియా-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ 161 పరుగులతో అదరగొట్టాడు. మొత్తం మీద సర్ఫరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.