Sarfaraz Khan: తొలి టెస్టులోనే అర్ధ సెంచరీ.. అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్
ఈ మ్యాచు ద్వారా సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచులోనే సర్ఫరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా కాలం జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన సర్ఫరాజ్.. మొదటి మ్యాచులోనే సత్తా చాటాడు.
Sarfaraz Khan: టెస్టు అరంగేట్రం చేసిన భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మొదటి మ్యాచులోనే అర్ధ సెంచరీ సాధించాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచు ద్వారా సర్ఫరాజ్ ఖాన్ టెస్టు అరంగేట్రం చేశాడు.
KHAMMAM MP: ఖమ్మం ఎవరికి..? ఎంపీ సీటు కోసం ఆ ముగ్గురు ! రేవంత్‌కు పెద్ద తలనొప్పే !
మొదటి మ్యాచులోనే సర్ఫరాజ్ అర్ధ సెంచరీ సాధించాడు. చాలా కాలం జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూసిన సర్ఫరాజ్.. మొదటి మ్యాచులోనే సత్తా చాటాడు. తన ప్రతిభ చాటి చెప్పాడు. సర్ఫరాజ్ వేగంగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఓపెనర్లుగా బరిలోకి దిగిన యశస్వి జైశ్వాల్ 10 బంతుల్లో 10 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధిచాడు. 196 బంతుల్లో 131 పరుగులు చేసి, మార్క్ వుడ్ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. అయితే, ఇటీవలి కాలంలో ఎక్కువగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచులో కూడా విఫలమయ్యాడు.
9 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ ఔటైన అనంతరం వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. మొత్తానికి మూడో టెస్టు, తొలి రోజు భారత ఆధిక్యం కనిపించింది. ఇప్పటికే 310 పరుగులు పూర్తి చేసుకున్న ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి.. బ్యాటింగ్‌లో మంచి స్కోరు సాధిస్తోంది.