Sarfaraz Khan: సర్ఫరాజ్‌పై కన్నేసిన కోల్‌కతా నైట్ రైడర్స్
మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సర్ఫరాజ్ ఖాన్‌ను రిలీజ్ చేయగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఈ క్రమంలో అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్ కేకేఆర్ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం.
Sarfaraz Khan: టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజ్ కోట్ టెస్టులో అతని ధనా ధన్ బ్యాటింగ్ కు చాలా మంది మాజీ ఆటగాళ్ళు ఫిదా అయిపోయారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఇండియాలోనే టోర్నీ..
ఐపీఎల్ 17వ సీజన్‌కు గానూ గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా నియమితుడయ్యాడు. మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సర్ఫరాజ్ ఖాన్‌ను రిలీజ్ చేయగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఈ క్రమంలో అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్ కేకేఆర్ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వేలం ముగిసిన తర్వాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకునే వీలులేదు. అయితే, ఎవరైనా ఆటగాడు గాయపడితే మాత్రం అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుంటుంది.
ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలోని ఏ ఆటగాడైనా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిస్తే వెంటనే సర్ఫరాజ్‌ను పిలిపించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు సమాచారం. కాగా సర్ఫరాజ్ ఖాన్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.