Musheer Khan: దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు.. అండర్ 19 వరల్డ్ కప్‌లో మరో సెంచరీ
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ సూపర్ శతకంతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్‌కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్ 118 పరుగులతో సత్తాచాటాడు.

Musheer Khan: టీమిండియా క్రికెటర్ సర్ఫ్ రాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అండర్ 19 వరల్డ్‌కప్ లో దుమ్ము రేపుతున్నాడు. తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరో సెంచరీ కొట్టాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ముషీర్ ఖాన్ సూపర్ శతకంతో చెలరేగాడు. 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ముషీర్‌కు ఇది రెండో సెంచరీ. అంతకముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ ఖాన్ 118 పరుగులతో సత్తాచాటాడు.
Dinesh Karthik: చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ కామెంట్స్
కివీస్ తో మ్యాచ్ లో సహచరులు వరుసగా వెనుదిరుగుతున్నా ముషీర్ మరో ఎండ్‌లో నిలబడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పరుగులు జోడిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 109 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన ముషీర్.. 325 పరుగులు చేశాడు. కాగా ఈ ముషీర్ ఖాన్ ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడే. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు సర్ఫరాజ్‌కు ఎంపికవడం..తాజాగా తన తమ్ముడు సెంచరీతో చెలరేగడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
చాలా కాలంగా దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న సర్ఫ్ రాజ్ ఎట్టకేలకు పిలుపు అందుకున్నాడు. కే ఎల్ రాహుల్ , జడేజా గాయాలతో దూరమవడం తో సర్ఫరాజ్ ఖాన్ రెండో టెస్టులో చోటు దక్కించుకున్నాడు.