ఏది పడితే అది రివ్యూనా ? ఇంగ్లాండ్ కెప్టెన్ పై సెటైర్లు
టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక్కసారి కూడా డీఆర్ఎస్ నెగ్గని సారథిగా విమర్శల పాలయ్యాడు.

టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఓలీ పోప్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఒక్కసారి కూడా డీఆర్ఎస్ నెగ్గని సారథిగా విమర్శల పాలయ్యాడు. ఇప్పటి వరకూ 10 సార్లు రివ్యూ తీసుకోగా ఒక్కసారి కూడా అతనికి అనుకూలంగా ఫలితం రాలేదు. అన్నింటిలోనూ ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ప్రపంచ క్రికెట్ లో మరే కెప్టెన్ కూడా ఈ స్థాయిలో రివ్యూల్లో ఫెయిల్ అవలేదు. డీఆర్ఎస్ ను కోరుకునే క్రమంలో పోప్ ఖచ్చితంగా వ్యవహరించలేకపోతున్నాడని తెలుస్తోంది. దీంతో రివ్యూస్ లో జీరో సక్సెస్ రేట్ తో ఉన్న పోప్ పై ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఏది పడితే అది రివ్యూ కోరితే రిజల్ట్ ఇలాగే ఉంటుందంటూ ట్రోల్ చేస్తున్నారు.