Saud Shakeel: ఎవడీ సౌద్ షకీల్.. పాకిస్థాన్ విరాట్ అంటున్నారు
గాలే అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ డబుల్ సెంచరీ సాధించాడు. 361 బంతులు ఎదుర్కొన్న సౌద్ 19 ఫోర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Saud Shakeel scored a double century in the match in Sri Lanka and became the fourth batsman in the world
మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్.. క్రికెట్ పుస్తకాల్లోని ప్రతి ఒక్క షాట్‌ను అవపోసన పట్టినట్లు.. ఇంజమాముల్ హక్, సయీద్ అన్వర్, మహమ్మద్ యూసుఫ్‌ను ఆవాహన చేసుకున్నట్లు.. చాలా పద్ధతిగా దంచికొడుతున్నాడు. అలాగే ఈ డబుల్ సెంచరీతో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల ప్రత్యేక విజయాన్ని సమం చేశాడు. అంటే శ్రీలంకలో టెస్టు క్రికెట్‌లో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే డబుల్ సెంచరీ సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో నాలుగో బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ చేరాడు.
2008లో గాలే టెస్టులో శ్రీలంకపై భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 208 పరుగులు చేశాడు. 2010లో కొలంబో టెస్టులో సచిన్ టెండూల్కర్ 203 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సొంతగడ్డ మీద లంకపై డబుల్ సెంచరీ సాధించిన ఆసియా బ్యాట్స్‌మెన్‌గా సచిన్-సెహ్వాగ్ రికార్డులకెక్కారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆతిథ్య శ్రీలంకపై టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 3వ ఆసియా బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ నిలిచాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన ప్రపంచంలో 4వ బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్ (208) పరుగులు , సచిన్ టెండూల్కర్ (203) పరుగులు , జో రూట్ (228) పరుగులు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో సౌద్ షకీల్ కూడా చేరాడు.