సెక్యూరిటీనే పెద్ద సవాల్ పాక్ క్రికెట్ బోర్డుకు టెన్షన్

ఏదైనా పెద్ద టోర్నీ నిర్వహణ అంత ఈజీ కాదు.. పైగా నిత్యం బాంబులతో దద్దరిల్లే పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడమంటే కత్తి మీద సామే.. టోర్నీ పూర్తయ్యే వరకూ పాక్ క్రికెట్ బోర్డుకు టెన్షన్ టెన్షనే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 03:20 PMLast Updated on: Feb 19, 2025 | 3:20 PM

Security Is The Biggest Challenge And Tension For The Pakistan Cricket Board

ఏదైనా పెద్ద టోర్నీ నిర్వహణ అంత ఈజీ కాదు.. పైగా నిత్యం బాంబులతో దద్దరిల్లే పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడమంటే కత్తి మీద సామే.. టోర్నీ పూర్తయ్యే వరకూ పాక్ క్రికెట్ బోర్డుకు టెన్షన్ టెన్షనే… ఎందుకంటే పాక్ లో పరిస్థితి అలాంటిది మరి.. మరే దేశంలోనైనా టోర్నీ నిర్వహణ బాగుంటే చాలు అనుకుంటారు.. కానీ పాక్ లో మాత్రం టోర్నీ పూర్తయ్యే వరకూ బాంబుల పడకుంటే చాలు అనుకోవాల్సిందే.. అందుకే అక్కడ పర్యటించేందుకు కొన్నేళ్ళుగా ఏ క్రికెట్ దేశం ముందుకు రాలేదు.. ఇప్పుడు ఐసీసీని ఒప్పించి భారీ భద్రత మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. పాక్ కాకుండా టోర్నీలో ఆడే మిగిలిన ఏడు జట్లలో ఆరు మాత్రమే అక్కడ ఆడేందుకు అంగీకరించాయి. భారత్ మాత్రం దుబాయ్ వేదికగా మ్యాచ్ లు ఆడబోతోంది. కానీ అక్కడకు వెళ్ళిన ప్రతీ జట్టుకూ ఎంతో కొంత టెన్షన్ ఉంటూనే ఉంటోంది. ఎంత భారీ భద్రత కల్పించినా విదేశీ జట్లు ప్రశాంతంగా ఉండలేవు.

ఇప్పటికే న్యూజిలాండ్ , సౌతాఫ్రికా జట్లు అక్కడ ట్రై సిరీస్ ఆడగా… తాజాగా ఆస్ట్రేలియా జట్టు కూడా పాక్ లో అడుగుపెట్టింది. వారి తొలి మ్యాచ్ లాహోర్‌లో జరగనుండటంతో.. ఆస్ట్రేలియన్లు నేరుగా అక్కడే ల్యాండ్ అయ్యారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, సీన్ అబోట్ సహా ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బంది లాహోర్ ఎయిర్‌పోర్టు నుండి హోటల్‍కి వెళ్తున్న దృశ్యాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యాన్ని ఓ సవాల్‍గా తీసుకున్న పాక్ క్రికెట్ బోర్డు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. తమ దేశానికి వస్తున్న జట్లకు భారీ భద్రత కల్పిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లాహోర్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన దగ్గర నుంచి హోటల్‌కి చేరుకునేవరకు దాదాపు 200 మంది పోలీసులు వారికి భద్రత కల్పించారు. అదే సమయంలో ఆసీస్ క్రికెటర్ల ముఖాల్లో కాస్త సీరియస్ నెస్ తో కూడిన టెన్షన్ అయితే కనిపిస్తోంది. బహుశా సెక్యూరిటీ గురించే వారు ఇలాంటి టెన్షన్ పడుతున్నట్టు భావిస్తున్నారు.

2009 పాకిస్తాన్ పర్యటనలో శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టుపై కాల్పులు జరిగాయి. శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో 12 మంది టెర్రరిస్టులు ఎటాక్ చేశారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ మహేల జయవర్ధనే, డిప్యూటీ కుమార్ సంగక్కర సహా ఐదుగురు క్రికెటర్లకు గాయాలు కాగా.. ఆరుగురు పాకిస్తాన్ పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. అప్పుడు హుటాహుటిన మిలిటరీ హెలికాఫ్టర్ లో లంక జట్టును తరలించిన దృశ్యాలు ఇప్పటికీ క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. అటువంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే.. పాకిస్థాన్ క్రికెట్ ఆతిథ్యం గురించి మర్చిపోవాల్సిందే. ఈ క్రమంలోనే పాక్ క్రికెట్ బోర్డు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. లాహోర్, రావల్పిండి నగరాల్లో 12,000 మందికి పైగా పోలీసులను మోహరించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. అయితే ఈ మెగాటోర్నీ పూర్తయ్యే వరకూ పాక్ లో ఆడే జట్లకే కాదు ఆతిథ్య పాక్ క్రికెట్ బోర్డుకు కూడా కంటిమీద కునుకుండదు.