ధోనీ తర్వాత అతడే తోపు కెప్టెన్ సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
దాదాపు 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ కు ఇది వరుసగా రెండో ట్రోఫీ. 9 నెలల ముందే టీ20 ట్రోఫీని భారత్ కైవసం దక్కించుకుంది.

దాదాపు 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. భారత్ కు ఇది వరుసగా రెండో ట్రోఫీ. 9 నెలల ముందే టీ20 ట్రోఫీని భారత్ కైవసం దక్కించుకుంది. భారత్‌కు వరుస ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ బెస్ట్ కెప్టెన్ అంటూ పొగడ్తల్లో ముంచేస్తున్నారు.
తాజాగా రోహిత్ ని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాశానికి ఎత్తేశాడు. టీమిండియాకు సారథిగా వ్యవహరించిన తీరు అత్యద్భుతమన్నాడు. రోహిత్ కెప్టెన్సీని చాలా మంది తక్కువ అంచనా వేశారని.. కానీ అతడు వరుసగా భారత్‌కు రెండు ట్రోఫీలను అందించాడని కొనియాడాడు. భారత్ క్రికెట్ లో ధోనీ తర్వాత ది బెస్ట్ కెప్టెన్ రోహితే అన్నాడు.తన బౌలర్లను వినియోగించుకునే విధానం.. జట్టును హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుందని ప్రశంసించాడు. అదే సమయంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అయిన ప్లేయర్లను సముదాయించడం చాలా బాగుందన్నాడు.
అవకాశం రాని వారికి సర్ది చెప్పిన తీరు తనకు ఎంతో నచ్చిందన్నాడు.మొదటి మ్యాచ్‌లో అర్ష్ దీప్ సింగ్‌ను కాదని హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చాడని.. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇచ్చాడని తెలిపాడు. ఇదే అతడిని ది బెస్ట్ కెప్టెన్‌గా నిలిపిందని చెప్పుకొచ్చాడు. అతడు తనకంటే.. తన జట్టుకోసం, సహచరుల కోసం ఎక్కువగా ఆలోచించే కెప్టెన్ అని కొనియాడాడు.ముఖ్యంగా ఎవరైనా ప్లేయర్ అభద్రతాభావంతో ఉంటే వారు సరైన పెర్మార్మ్ చేయలేరని తనకు తెలుసని.. అందువల్లే ఎవరూ అలా ఉండకుండా రోహిత్ బాగా హ్యండిల్ చేస్థాడని కితాబిచ్చాడు. ఇలా అన్ని విషయాల్లోనూ రోహిత్ బాగా పనిచేస్తున్నాడని ప్రశంసించాడు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.