దుమ్మురేపిన కరుణ్ నాయర్ మైసూర్ దే మహారాజా ట్రోఫీ
కర్ణాటక దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ మహారాజా ట్రోఫీలో సీనియర్ క్రికెటర్ కరుణ్ నాయర్ దుమ్మురేపాడు.

కర్ణాటక దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ మహారాజా ట్రోఫీలో సీనియర్ క్రికెటర్ కరుణ్ నాయర్ దుమ్మురేపాడు. టోర్నీ ఆద్యంతం పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ ఫైనల్లోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మైసూర్ వారియర్స్ ను విజేతగా నిలిపాడు. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో మైసూర్ వారియర్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.మైసూర్ వారియర్స్ కు సారథ్యం వహిస్తున్న కరుణ్ నాయర్ టైటిల్ పోరులో 45 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. ఫైనల్లో మైసూర్ వారియర్స్ 207 రన్స్ చేయగా.. బెంగళూరు బ్లాస్టర్స్ 162 పరుగులకే పరిమితమైంది. 12 మ్యాచ్‌లలో కలిపి 560 పరుగులు చేసిన కరుణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.