దులీప్ ట్రోఫీ ఫస్ట్ డే సీనియర్ క్రికెటర్ల ఫ్లాప్ షో
దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీలో అదరగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడాలనుకున్న సీనియర్ క్రికెటర్లు తొలిరోజు ఫ్లాప్ షో కనబరిచారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్లు అంతా మూకుమ్మడిగా విఫలం అయ్యారు.
దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీలో అదరగొట్టి సెలక్టర్ల దృష్టిలో పడాలనుకున్న సీనియర్ క్రికెటర్లు తొలిరోజు ఫ్లాప్ షో కనబరిచారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్లు అంతా మూకుమ్మడిగా విఫలం అయ్యారు. ఇండియా-బి కు ఆడుతున్న జైస్వాల్ 30 పరుగులకే పరిమితమయ్యాడు. ఇదే జట్టుకు ఆడుతున్న
సర్పరాజ్ ఖాన్ 9, రిషబ్ పంత్ 7, నితీశ్ కుమార్ రెడ్డి డకౌటయ్యారు. గత ఐపీఎల్ లో దుమ్మురేపిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్.. ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. అలాగే చాలా రోజుల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న పంత్ కూడా విఫలమయ్యాడు. ఇక
ఇండియా-డికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫ్లాపయ్యాడు. కేవలం 9 పరుగులే చేసి ఔటయ్యాడు. అలాగే దేవ్ దత్ పడిక్కల్ డకౌటయ్యాడు.
బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ కోసం వచ్చే వారం జట్టును ఎంపిక చేయనున్నారు. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్ లో రాణించే యువ ఆటగాళ్ళను కూడా జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటామని సెలక్టర్లు చెప్పకనే చెప్పారు. దీనితో పాటు రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న సీనియర్లకూ ఈ టోర్నీ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఇలాంటి కీలక సమయంలో జైస్వాల్, పంత్, శ్రేయస్ అయ్యర్, పడిక్కల్ స్థాయికి తగినట్టు ఆడకపోవడం ఫ్యాన్స్ ను కూడా నిరాశకు గురి చేసింది.