Shivam Dube: శివ తాండవం ఆడేస్తున్న శివమ్ దూబె
బౌండరీలు కొట్టడానికి ఏ మాత్రం ఇష్టపడని ఈ పొడగరి బ్యాటర్.. బంతి పడిందే తడవుగా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. స్పిన్ లేదు.. పేస్ లేదు. ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటూ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు.
Shivam Dube: చెన్నై సూపర్ కింగ్స్ పించ్ హిట్టర్ శివమ్ దూబె ఈ ఐపీఎల్ సీజన్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్నాడు. మిడిల్ ఓవర్స్‌లో బ్యాటింగ్‌కు దిగుతున్న ఈ లెఫ్టాండర్.. ఆఖరి వరకు క్రీజులో ఉంటూ నమ్మశక్యం కాని రీతిలో హిట్టింగ్ చేస్తున్నాడు. బౌండరీలు కొట్టడానికి ఏ మాత్రం ఇష్టపడని ఈ పొడగరి బ్యాటర్.. బంతి పడిందే తడవుగా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. స్పిన్ లేదు.. పేస్ లేదు. ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటూ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు.
PAWAN KALYAN: పవన్ అప్పులు.. పవన్‌కు చిరంజీవి భార్య ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా
చెన్నై విజయాల్లో కీలకంగా మారిన ఈ హిట్టర్ లక్నోతో మ్యాచ్‌లోనూ శివ తాండవం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న దూబె.. 27 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 3 బౌండరీలు ఉంటే.. ఏకంగా 7 భారీ సిక్సులు ఉన్నాయి. 244 స్ట్రయిక్ రేట్తో బ్యాటింగ్ చేసిన దూబే.. బాదుడే పనిగా ఆడాడు. యష్ ఠాకూర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. స్లో బాల్స్, బౌన్సర్స్, క్వికర్ డెలివరీస్.. ఇలా.. ఎలా వేసినా బాదేస్తుండటంతో దూబెను ఎలా ఆపాలో లక్నో బౌలర్లకు అర్థం కాలేదు.
దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ దూబే దుమ్ము రేపాడు. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన శివమ్ దూబే 51 పైగా యావరేజ్‌తో 311 రన్స్ చేశాడు. ఈ హిట్టింగ్‌తో టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో ప్లేస్ కోసం పోటీ పడుతున్నాడు.