షకీబుల్ సంచలన నిర్ణయం టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. కాన్పూర్ వేదికగా భారత్ జరిగే రెండో టెస్టుకు షకీబుల్ ఈ ప్రకటన చేశాడు.
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. కాన్పూర్ వేదికగా భారత్ జరిగే రెండో టెస్టుకు షకీబుల్ ఈ ప్రకటన చేశాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే టెస్టు సిరీస్ తన కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు. సొంతగడ్డపై సొంత అభిమానుల మధ్య టెస్టు కెరీర్ ముగించడం సంతోషకరంగా ఉంటుందని షకీబుల్ వ్యాఖ్యానించాడు.. బంగ్లాదేశ్ క్రికెట్ తనకెంతో ఇచ్చిందని, అందుకే ఆఖరి టెస్టు స్వదేశంలోనే ఆడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే బంగ్లాదేశ్ తో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సఫారీలతో సిరీస్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ సౌతాఫ్రికాతో సిరీస్ రద్దయితే మాత్రం భారత్ తో జరిగే రెండో టెస్ట్ షకీబుల్ కెరీర్ లో చివరి మ్యాచ్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఇటీవలే షకీబుల్ పై హత్య కేసు నమోదైంది. దేశంలో చెలరేగిన అల్లర్లలో తన కుమారుడు చనిపోవడానికి కారణం ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ సభ్యులు కారణమంటూ ఓ వ్యక్తి షకీబ్‌పై కూడా కేసు పెట్టాడు. మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ లో అద్భుతమైన ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన షకీబుల్ హసన్ 2007లో టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లలో 4600 పరుగులు చేయగా.. అందులో ఐదు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. బంతితోనూ సత్తా చాటిన షకీబుల్ టెస్టుల్లో 242 వికెట్లు తీశాడు.