Mohammad Shami : దేశవాళీ క్రికెట్ బరిలో షమీ.. బీసీసీఐ కండీషన్ కు ఓకే
టీమిండియా (Team India) స్టార్ పేసర్ (Pacer) మహ్మద్ షమీ (Mohammad Shami) రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ప్రపంచకప్ (World Cup) తర్వాత గాయపడి ఇటీవలే కోలుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

టీమిండియా (Team India) స్టార్ పేసర్ (Pacer) మహ్మద్ షమీ (Mohammad Shami) రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ప్రపంచకప్ (World Cup) తర్వాత గాయపడి ఇటీవలే కోలుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే టీమిండియా (Team India) లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఎవ్వరైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ (BCCi) ఇటీవలే రూల్ పెట్టింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. దీంతో షమీ సైతం బీసీసీఐ(BCCI) కొత్త నిబంధనకు ఓకే చెబుతూ దేశవాళీ క్రికెట్ (Cricketer) ఆడబోతున్నాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) తరుపున ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తానెప్పుడు జాతీయ జట్టులోకి వస్తానో చెప్పడం కష్టమని షమీ వ్యాఖ్యానించాడు. జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే జాతీయ జట్టు కంటే ముందు బెంగాల్ తరుపున ఆడతానని స్పష్టం చేశాడు. పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు రెండు లేదా మూడు మ్యాచులు ఆడతానని వెల్లడించాడు. వన్డే పప్రపంచకప్ (ODI World Cup) సమయంలో అయిన గాయం తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయినట్లుగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ (IPL) ఆడి టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) కు రెడీ అవుదామనుకున్న తరుణంలో గాయం సర్జరీ వరకు వెళ్ళాల్సిన పరిస్థితిని తెచ్చిందన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక ఫిట్ నెస్ కోసం శ్రమిస్తున్నట్టు షమీ వెల్లడించాడు.