Shashank Singh: పొరపాటున కొంటే అతనే దిక్కయ్యాడు.. మారుమోగుతున్న శశాంక్ సింగ్ పేరు
ధావన్, బెయిర్ స్టో, సికిందర్ రజా వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట.. శశాంక్ సింగ్ సత్తాచాటాడు. పంజాబ్‌కు ఓటమి తప్పదు అనుకున్న వేళ శశాంక్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.

Shashank Singh: ఐపీఎల్ వేలంలో ఇద్దరూ శశాంక్ సింగ్‌లు ఉండడంతో పంజాబ్ కింగ్స్ కాస్త కన్ఫ్యూజ్ అయింది. పొరపాటున వేరే శశాంక్ సింగ్ అనుకోని ఈ ఛత్తీస్‌ఘడ్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్‌ని కొనుగోలు చేసిందని వార్తలు వినిపించాయి. ఇలా కన్ఫ్యూజన్‌లో పంజాబ్ జట్టులోకి వచ్చిన శశాంక్.. ఇప్పుడు ఆ జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Kadiyam Kavya: కావ్యకు రెండు పార్టీల్లో శత్రువులు ! గెలుపు అంత ఈజీ కాదా!!
ధావన్, బెయిర్ స్టో, సికిందర్ రజా వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట.. శశాంక్ సింగ్ సత్తాచాటాడు. పంజాబ్‌కు ఓటమి తప్పదు అనుకున్న వేళ శశాంక్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి, పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్‌ను కొనసాగించి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా పంజాబ్ 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పొరపాటున కొంటే అతనే దిక్కయ్యాడు అని, లేదు తనను తాను నిరూపించుకున్నాడని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.