Shikhar Dhawan: తళపతి విజయ్ పాటకు గబ్బర్ భాయ్ ఊరమాస్ స్టెప్స్
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంత ప్రమాదకరమైన బ్యాటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలోకి అడుగుపెడితే తనదైన స్టయిల్లో అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. సెంచరీ చేయగానే రెండు చేతులు సూటిగా ఆడియన్స్ వైపుగా చూపించడం, క్యాచ్ పట్టిన అనంతరం తొడ కొడుతూ సంబరాలు చేసుకోవడం లాంటివి చేస్తూ కెమెరాని తనవైపు తిప్పుకుంటాడు.

Shikhar Dhawan took to his social media account to step to the song of his film on the occasion of hero Vijay's birthday
గ్రౌండ్ లో చేసే హడావుడి సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో గబ్బర్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ స్పోర్టీవ్ గా ఉండే ధావన్.. టీమిండియాలో స్థానం కోల్పోయినా డ్యాన్స్ వేస్తూ అభిమానులకి మంచి కిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ధావన్ చేసిన ఈ డ్యాన్స్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా వేదికగా ధావన్ ఎప్పుడూ అందరిని పలకరిస్తూనే ఉంటాడు.
ఇందులో భాగంగా ఆ మధ్య ఓ బాలీవుడ్ మూవీలోని కనబడి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసాడు. కొన్ని యాడ్స్ లో నటించిన ధావన్ వీలు చిక్కినప్పుడల్లా రీల్స్ చేస్తూ చిల్ అవుతూ ఉంటాడు. ఈ వెటరన్ ప్లేయర్ చేసే డ్యాన్స్ కి మంచి క్రేజ్ ఉంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి అప్ కమింగ్ మూవీ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన “నా రెడీ” అనే పాటకు ధావన్ డ్యాన్స్ వేస్తూ అభిమానులని ఖుషి చేసాడు. ధావన్ జోష్ కి ఫిదా అయిపోయిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. టీమ్‌లో ఉన్నా లేకపోయినా ధావన్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.