Shikhar Dhawan: నిన్ను చూడనివ్వడం లేదు.. కొడుకు కోసం ధావన్ ఎమోషనల్ పోస్ట్..
శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడిపోయాడు. తనను ఆయేషా మానసికంగా వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాలని ధావన్ కోర్టుకెళ్లడం, విచారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడం కూడా జరిగిపోయాయి.
Shikhar Dhawan: భారత క్రికెట్ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. “జట్టులో పలువురు యువ ఆటగాళ్లు ఉండడంతో ధావన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే గబ్బర్ కనిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం అంత సాఫీగా లేదు. తాజాగా కొడుకు కోసం అతను పెట్టిన పోస్ట్ దీనికి నిదర్శనం. తన భార్య అయేషా ముఖర్జీతో అతను విడిపోయాడు. తనను ఆయేషా మానసికంగా వేధిస్తోందని విడాకులు మంజూరు చేయాలని ధావన్ కోర్టుకెళ్లడం, విచారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేయడం కూడా జరిగిపోయాయి.
Yuvraj Singh: టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేది భారత్ కాదు: యువరాజ్ సింగ్
కుమారుడిని అతడికి అప్పగించేందుకు నిరాకరించిన కోర్టు.. ఫోన్లో మాట్లాడొచ్చని, స్కూల్ సెలవుల సమయంలో తన కుమారుడితో భారత్‌లో కలిసి ఉండవచ్చని చెప్పింది. ఈ నిబంధనకు అయేషా కూడా సహకరించాలని కోర్టు ఆదేశించింది. అయితే మూడు నెలలుగా కుమారుడు జొరావర్తో మాట్లాడనివ్వడం లేదని ధావన్ తాజాగా ఇన్‌స్టాలో వెల్లడించాడు. కొడుక్కి బర్త్ డే అని శుభాకాంక్షలు తెలుపుతూ గబ్బర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నేరుగా నిన్ను చూసి ఏడాది దాటింది.. కాంటాక్ట్ లేకుండా దాదాపు మూడు నెలల గడిచాయి. ప్రతి చోట నన్ను బ్లాక్ చేశారు. అందుకే పాత ఫొటోతో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ధావన్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. మనం మళ్లీ కలుసుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నానంటూ గబ్బర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ధావన్‌కు అండగా నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనని చెప్పొచ్చు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో అతనికి చివరి అవకాశం ఇస్తారని భావించినా అదేమీ జరగలేదు. 38 ఏళ్ళ ధావన్ ఇప్పటి వరకూ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడాడు. గత ఏడాది డిసెంబర్‌లో భారత జట్టుకు ఆడిన థావన్ త్వరలోనే తన రిటైర్మెంట్‌పై అధికారిక ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు.