Shivam Dube: వరల్డ్ కప్ టీంలో పవర్ హిట్టర్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!
ప్రస్తుతం విదేశీ బౌలర్లకు శివమ్ దూబె పేరు వింటేనే వారికి గొంతు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిల్చున్న చోటు నుంచి ఎంతటి తోపు బౌలర్ ని అయినా అలవోకగా సిక్సర్ కొట్టేస్తున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు.. ఉన్నంతసేపు బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు.
Shivam Dube: టీమిండియా టీ20 వరల్డ్ కప్ టీమ్ చూసిన తర్వాత అభిమానులు ఆనంద పడుతుంటే.. ప్రత్యర్థులు మాత్రం వణికిపోతున్నారు. ముఖ్యంగా ఒకే ఒక్క హిట్టర్ గురించే వారి టెన్షన్ ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే అతను కొడితే బంతి బౌండరీ లేదా సిక్సర్ గా మారుతోంది. అతను మరెవలో కాదు.. శివమ్ దూబె. ప్రస్తుతం విదేశీ బౌలర్లకు శివమ్ దూబె పేరు వింటేనే వారికి గొంతు ఎండిపోయే పరిస్థితి ఉంది.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక.. హార్దిక్‌కు చోటు..!
ఎందుకంటే నిల్చున్న చోటు నుంచి ఎంతటి తోపు బౌలర్ ని అయినా అలవోకగా సిక్సర్ కొట్టేస్తున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు.. ఉన్నంతసేపు బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. హేమా హేమీ బౌలర్లు అందరూ ఈ ఐపీఎల్ లో అతని బాధితులే. శివమ్ దూబె ఆడుతుంటే చూసే వారికి శివ తాండవం లాగానే కనిపిస్తుంది. ఎక్కడ బాల్ వేసినా దానిని బౌండరికీ పంపడమే అతని లక్ష్యం. డిఫెన్స్ చేయడం, సింగిల్స్ తీయడం లాంటివి అస్సలు చేయడం లేదు. ఈ పవర్ హిట్టర్ 9 మ్యాచుల్లో 58 యావరేజ్ తో 350 రన్స్ చేశాడంటే అతని దూకుడు అర్థం చేసుకోవచ్చు. దీంతో శివమ్ దూబేకి వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయం అని అంతా అనుకున్నారు.
చివరికి వారి అంచనాలు నిజం చేస్తూ బీసీసీఐ వరల్డ్ కప్ కోసం దూబేను ఎంపిక చేసింది. సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఇక ఆస్ట్రేలియా లాంటి జట్లకు టీమిండియా ఫ్యాన్స్ సవాళ్లు విసురుతున్నారు. మా వాడి దెబ్బకు మీ బౌలర్లకు దబిడి దిబిడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.