Shivam Dube: వరల్డ్ కప్ జట్టులో చెన్నై హిట్టర్..? చోటు ఖాయం అంటున్న ఎక్స్‌పర్ట్స్
తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ శివం శివాలెత్తిపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో శివం దూబేపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Shivam Dube: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ శివం దూబే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్ 17వ సీజన్ లోనూ సత్తా చాటుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ శివం శివాలెత్తిపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో శివం దూబేపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
YS SHARMILA: మద్యపాన నిషేధం అంటే ప్రభుత్వమే మద్యం అమ్మడమా..?: వైఎస్ షర్మిల
హార్దిక్ పాండ్యా కంటే శివం దూబేకే టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఆడే అర్హత ఎక్కువగా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, శివం దూబే కేవలం స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రమే ఆడగలడన్న వాదనలను తాజాగా తప్పని నిరూపించాడు.ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పేసర్లను చితక్కొట్టాడు. బంతిని సరిగ్గా అంచనా వేస్తూ తెలివైన షాట్లతో విరుచుకుపడుతున్న దూబేను ఆపడం ముంబై పేసర్ల తరం కాలేదు. తద్వారా ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేడన్న అభిప్రాయాలను పటాపంచలు చేశాడు.
రానున్న వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తనకు వందకు వంద శాతం ఆడే అర్హత ఉందని తన బ్యాటింగ్ నైపుణ్యాలతో చెప్పకనే చెప్పాడని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్‌కప్ ఈవెంట్‌కు భారత జట్టులో శివం దూబేకు చోటు ఇవ్వాలని టీమిండియా సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.