Shivam Dube: యూవీని చూసినట్టే ఉంది.. శివం దూబేపై ఆకాశ్ చోప్రా ప్రశంసలు
ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. దూబే ఆటతీరుకు ఫిదా అయ్యాడు. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడన్నాడు. శివంను లోయర్ ఆర్డర్‌లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు.

Shivam Dube: టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబేపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. దూబే ఆట తీరు చూస్తుంటే తనకు యువరాజ్ సింగ్ గుర్తుకు వస్తున్నాడని కితాబిచ్చాడు. టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టులో ఈ ముంబై బ్యాటర్‌కు కచ్చితంగా చోటివ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అఫ్గనిస్తాన్‌తో టీ ట్వంటీ సిరీస్‌లో శివం దూబే.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు.
BARRELAKKA: లోక్‌సభ బరిలో బర్రెలక్క.. ఎక్కడి నుంచి పోటీ అంటే..
మూడు మ్యాచ్‌లలో 124 పరుగులు సాధించిన ఈ పేస్ ఆల్‌రౌండర్.. రెండు వికెట్లు తీశాడు. టీమిండియా క్లీన్ స్వీప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. గాయం కారణంగా దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో వచ్చిన దూబే.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి ప్రపంచకప్ రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు గట్టి సందేశమే పంపాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా.. దూబే ఆటతీరుకు ఫిదా అయ్యాడు. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడన్నాడు. శివంను లోయర్ ఆర్డర్‌లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
అతడి ఆట తీరు చూశాక కొందరైతే హార్దిక్‌ను వదిలేసి.. దూబేను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. తన వరకైతే ఈ ఇద్దరూ జట్టులో ఉంటే బాగుంటుందని చోప్రా చెప్పాడు. ఐపీఎల్‌లోనూ దూబే ఇలాగే రాణిస్తే.. టీమిండియాలోకి రాకుండా అతడిని ఎవరూ ఆపలేరుని మాజీ ఓపెనర్ తేల్చేశాడు.